ఆ గౌరవం దక్కించుకున్న తొలి నటుడ్ని నేనే...మాధవన్
హీరో మాధవన్‌కు చెన్నైలో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు లండన్ మ్యూజియంలో మైనపు బొమ్మలను ఏర్పాటు చేసిన తరహాలో చెన్నై టీనగర్‌లోని జాయ్ అలూకాస్ షోరూమ్‌లో మాధవన్ మైనపు బొమ్మను ప్రతిష్ఠించారు. సంస్థ బ్రాండ్ అంబాసిడర్ అయిన మాధవన్ మైనపు బొమ్మను బాలీవుడ్ నటి అదాశర్మ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాధవన్ మాట్లాడుతూ దేశంలో ప్రథమంగా మైనపు బొమ్మ గౌరవాన్ని దక్కించుకున్న తొలి నటుణ్ణి తాను కావడం గర్వంగా ఉందన్నారు. మరో రెండు వారాల్లో బెంగళూరులో మరో మైనపు బొమ్మను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వెల్లడించారు.ఇక మాధవన్..కమల్ హాసన్ కాంబినేషన్ లో చేసిన మన్మధబాణం చిత్రం రీసెంట్ గా విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











