దబాంగ్ రీమేక్ లో రెండో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన మధు శాలిని
'వాడు-వీడు" చిత్రంతో మళ్లీ హీరోయిన్ గా అవకాశం సంపాదించిన హీరోయిన్ మధు శాలిని. తెలుగు, తమిళ భాషల్లో సరైన అవకాశాలు రాకపోవడంతో అందాల మధుశఆలిని. తెలుగు, తమిళ భాషల్లో సరైన అవకాశాలు రాకపోవడంతో అందాల ప్రదర్శనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఇటీవలే విడుదలైన 'వాడు-వీడు" చిత్రంతో ఈ అమ్మడికి పేరేమి రాకపోయినప్పటికీ ఓ టాప్ హీరో సినిమాలో రెండు అవకాశాలు వచ్చాయి.
హిందీలో ఘన విజయం సాధించిన 'దబాంగ్" చిత్రాన్ని, తమిళంలో 'ఒస్తి" పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో శింబు హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో మధు శాలిని కూడా ఓ కీలక పాత్రలో నటించడతో పాటుగా..ఈ చిత్రం కోసం ఓ పాటను కూడా పాడుతుంది..అయితే ఈ చిత్రంతోనైనా తనకు మళ్లీ అవకాశాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తుంది..


Click it and Unblock the Notifications











