తాప్సీ బోయ్ ప్రెండ్ హీరోగా మధురా శ్రీధర్ చిత్రం

By Srikanya

చెన్నై: ఆ మధ్యన తాప్సీ విషయమై తమిళ హీరో మహత్, మంచు మనోజ్ గొడవలు పడిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత తాప్సీ వాళ్లు గొడవ పడింది నా గురించి కాదనీ వివరణ ఇచ్చింది. అయితే తమిళ మీడియా మాత్రం మహత్ ని ఇప్పటికీ తాప్సీ బోయ్ ప్రెండ్ గానే అభివర్ణిస్తోంది. తాజాగా మహన్ ని తెలుగు దర్శకుడు మధురా శ్రీధర్ తన సినిమాలో హీరోగా తీసుకున్నాడని సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుందని చెప్తున్నారు. సెప్టెంబర్ 20 నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది.

ఇంతకుముందు బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా ఈ చిత్రం అనుకున్నారు. అయితే ఇప్పుడు సీన్ లోకి మహత్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి టైటిల్ 'ఈనాడే ఏదో అయ్యింది'. త్వరలో ఈ ప్రాజెక్టు ప్రారంభం అవుతోందంటూ తమిళ మీడియా చెప్తోంది. గతంలో స్నేహగీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ చిత్రాల ద్వారా పరిచయమైన మధుర శ్రీధర్ ఈ ప్రాజెక్టుతో హిట్ కొడతాననే నమ్మకంగా ఉన్నారు.

వీర్య దానం కధాంశంతో హిందీలో వచ్చిన విక్కీ డోనర్ తరహా కథాంసమే ఈ చిత్రం అని తెలుస్తోంది. దానకర్ణ,దానకర్ణుడు అనే టైటిల్స్ ని ఈ చిత్రం కోసం రిజిస్టర్ చేసారు. అయితే అవేమీ కాకుండా ఈ టైటిల్ ని పిక్స్ చేసినట్లుసమాచారం. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుపుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ కు వెళ్లే అవకాశం ఉంది. ఇక తన చిత్రం విక్కీ డోనర్ రీమేక్ లేదా ఫ్రీమేక్ కాదని గతంలో మధురా శ్రీధర్ మీడియాకు తెలియచేసారు.

ఇక ఈ విషయమై మధుర శ్రీధర్ ఓ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ...విక్కీ డోనర్ చూసి నేను ప్రేరణ పొందలేదు. పేపర్లో వచ్చిన స్పెర్మ్ డొనేషన్ మీద వచ్చిన ఓ ఆర్టికల్ చదివి కథ రెడీ చేసుకున్నాను. చెన్నైకి చెందిన ఓ జంట ఆన్ లైన్లో ఐఐటి పాస్ అయిన వ్యక్తి వీర్యం కావాలంటూ ప్రకటన ఇచ్చారు. అది చదివిన దగ్గరనుంచి నేను ఆలోచనలో పడి ఆ పాయింట్ మీద సినిమా చెయ్యాలనుకున్నాను. నా సినిమా ఓ ప్రేమ కథ. సరోగెట్ మదర్ కి,స్పెర్మ్ డొనేటర్ కి మధ్య జరుగుతూంటుంది అని వివరించారు. గతంలో మధుర శ్రీధర్... ఇట్స్ మై లవ్ స్టోరీ,స్నేహ గీతం చిత్రాలు డైరక్ట్ చేసారు. భాక్సాఫీస్ వద్ద ఫలితం ప్రక్కన పెడితే ఈ చిత్రాల ద్వారా చాలా మంది కొత్త వాళ్లు పరిశ్రమకు పరిచయమయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X