లిప్‌లాక్ ముద్దులు వద్దన్నందుకు ఆ హీరోయిన్‌ను...
Recommended Video

ఈ మధ్య కాలంలో సినిమాల్లో ముద్దుసీన్లు సర్వసాధారణం అయిపోయాయి. కొన్ని సినిమాలకైతే ముద్దు సీన్లే ప్రధానంగా స్ట్రిప్టు రాసుకుంటున్నారు దర్శకులు. మరీ ఇన్ని ముద్దు సీన్లా? అని ఎవరైనా ప్రశ్నిస్తే స్క్రిప్టు డిమాండ్ చేసింది కాబట్టి తప్పలేదని తేగేసి చెబుతున్నారు. ఇలాంటి స్క్రిప్టులతో హీరోయిన్లను సంప్రదించినపుడు వారు ముద్దు సీన్లు చేయడానికి నో చెబితే నిర్దాక్షిణ్యంగా తమ సినిమాలకు దూరం పెడుతున్నారు. తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది అంటోంది 'ప్రేమమ్' మూవీ ఫేం, మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్.

వద్దన్నందుకు 3 పెద్ద సినిమాలు మిస్
ముద్దు సీన్లు వద్దన్నందుకు తనకు మూడు పెద్ద సినిమాల్లో అవకావాలు పోయాయని, అయినా సరే ఏ మాత్రం బాధ పడలేదని, ఎందుకంటే తాను అలాంటి సీన్లకు పూర్తి గా వ్యతిరేకమని ఇటీవల పత్రిక ఇంటర్వ్యూలో వెల్లడించింది.

కౌగిలింతకే ఏడ్చేశా
నాకు బిడియం ఎక్కువ, బయటివారితో మాట్లాడేందుకు భయపడే తత్వం. తొలిసారి కౌగిలింత సీన్ చేసిన తర్వాత ఏడ్చేశానని ఆమె చెప్పుకొచ్చారు. సినిమాలు చేయగా చేయగా అలాంటి భయం తనలో పోయిందన్నారు.

సినిమాల ఎంపిక
సినిమాల ఎంపికలో ముందుగా కథ నచ్చాలి, ఆ తర్వాత నా పాత్ర ప్రధాన్యత నచ్చాలి. ఈ రెండింటి తర్వాతే దర్శకుడు ఎవరు? పారితోషికం ఎంత? అనే విషయాలకు ప్రాముఖ్యత ఇస్తానని మడోన్నా తెలిపారు.

ప్రేమ నా వ్యక్తిగతం
ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా? అనే ప్రశ్నకు మడోన్నా స్పందిస్తూ... ఇలాంటివి తన వ్యక్తిగతమని, వీటిని ఎవరితోనూ పంచుకోవడం తనకు ఇష్టం ఉండదన్నారు. ఏదైనా సమయం వచ్చినపుడు అన్ని విషయాలు తానే బయట పెడతాను అని తెలిపారు.


Click it and Unblock the Notifications











