Mark Antony మూవీ రిలీజ్‌పై బ్యాన్.. విశాల్‌కు మద్రాస్ హైకోర్టు షాక్!
తమిళ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. విశాల్ నటించిన మార్క్ ఆంథోని సినిమా రిలీజ్ నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడం దక్షిణాది సినిమా పరిశ్రమలో సంచలనం రేపింది. ప్లాన్ ప్రకారం మార్క్ ఆంథోని సినిమాను సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం వెనుక వివరాల్లోకి వెళితే..
విశాల్ 2019లో గోపురం ఫిల్మ్స్‌కు చెందిన అంబు ఛేంజియన్‌తో రుణ ఒప్పందం చేసుకొన్నాడు. భవిష్యత్‌లో విశాల్ రూపొందించే సినిమాల హక్కులు తమకే చెందేలా ఇరువురు ఒప్పందం చేసుకొన్నారు. అయితే ఆ ఒప్పందాన్ని విశాల్ ఉల్లంఘించారు. లైకాతో తన సినిమా హక్కులు ఇచ్చేలా ఒప్పందం చేసుకొన్నాడు. దాంతో గోపురం, లైకా మధ్య వివాదం నెలకొన్నది.

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు విశాల్ భారీగా డబ్బు చెల్లించాల్సి ఉంది. గత కొద్దికాలంగా వారి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. విశాల్ తాను ఇవ్వాల్సిన డబ్బును చెల్లించలేకపోవడంతో లైకా ప్రొడక్షన్ మద్రాస్ కోర్టును ఆశ్రయించింది. తమకు విశాల్ చెల్లించాల్సిన 21.29 కోట్ల రూపాయలను చెల్లించేలా కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అయితే లైకా ప్రొడక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్‌తో విశాల్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులకు విశాల్ సమాధానం ఇవ్వలేకపోవడం, అలాగే కోర్టు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి పీటీ ఆశా ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాల్ నటించిన సినిమా రిలీజ్‌ను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో విశాల్‌కు భారీ షాక్ తగిలినట్లయింది.
విశాల్‌కు శుక్రవారం మద్రాస్ హైకోర్టు పీటీ ఆశా నోటీసులు జారీ చేస్తూ.. వ్యక్తిగతం 12వ తేదీన కోర్టుకు హాజరుకావాలని సూచించింది. కోర్టు ఆదేశాలకు ఎందుకు జవాబు ఇవ్వలేదు అనే విషయంపై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశాల్లో సూచించింది. అలాగే 15 కోట్ల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కింద జమ చేయాలి. అలాగే విశాల్ ఆస్తుల వివరాలను కోర్టుకు వెల్లడించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాల్లో సూచించింది.

అలాగే కోర్టు ఆదేశాలపై సెప్టెంబర్ 9వ తేదీన పిటిషన్ దాఖలు చేయాలని విశాల్‌కు న్యాయమూర్తి ఆదేశించింది. అలాగే ఈ కేసు విచారణను సెప్టెంబర్ 12వ తేదీన తిరిగి విచారిస్తామని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


Click it and Unblock the Notifications











