మణిరత్నంకి వ్యక్తిగత భద్రత కల్పించమని కోర్టు ఆదేశం
దీంతో మణిరత్నం నివాసానికి, కార్యాలయానికి రక్షణ కల్పించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రాజేశ్వరన్ బుధవారం మణిరత్నం కార్యాలయానికి, నివాసానికి భద్రతనివ్వాలని ఆదేశించారు. వ్యక్తిగత భద్రత కూడా కల్పించాలని గురువారం తాజాగా ఆదేశించారు. మార్చి 14వ తేదీ వరకు మణిరత్నం ఇంటికి, కార్యాలయానికి భద్రత కల్పించాలని పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం మణిరత్నంపై చెన్నై నగర పోలీసు కమీషనర్‌కి మన్నన్ అనే పంపిణీదారుడు ఫిర్యాదు చేశారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం కడల్ (తెలుగులో కడలి) ఈ నెల 1న విడుదలైంది. ఆ చిత్రం పంపిణీ మూలంగా భారీగా నష్టపోయామని మణి ఇంటి ఎదుట పంపిణీదారులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.
ఆ పిర్యాదులో... ''రూ.16 కోట్లు వెచ్చించి కొంటే రూ.3.2 కోట్లు మాత్రమే వచ్చింది. కడల్ చిత్రాన్ని పంపిణీకి ముందు ఓసారి చూపించమని కోరితే సాంకేతిక కారణాల వల్ల కుదరదని మణిరత్నం మేనేజర్ తెలిపారు. దర్శకుడిపై నమ్మకంతో కొన్నాను. నష్టం గురించి ఆయనతో చర్చించాలని పలుమార్లు ప్రయత్నించాను. భేటీ కుదరలేదు. నష్టపోయిన మొత్తాన్ని ఇప్పించాలి''అని ఆ ఫిర్యాదులో మన్నన్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications












