twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మణిరత్నంకి వ్యక్తిగత భద్రత కల్పించమని కోర్టు ఆదేశం

    By Srikanya
    |

    చెన్నై: ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నంకు వ్యక్తిగతంగా భద్రత కల్పించాలని మద్రాసు హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. 'ముంబయ్‌' చిత్రం తీసినప్పటి నుంచి ఆయనకు వ్యక్తిగత భద్రత ఉండేది. దీన్ని ఇటీవల ఉపసంహరించారు. ప్రస్తుతం తమిళ చిత్రం 'కడల్‌' వ్యవహారంలో పంపిణీదారులు మణిరత్నంను బెదిరించారు.

    దీంతో మణిరత్నం నివాసానికి, కార్యాలయానికి రక్షణ కల్పించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.రాజేశ్వరన్‌ బుధవారం మణిరత్నం కార్యాలయానికి, నివాసానికి భద్రతనివ్వాలని ఆదేశించారు. వ్యక్తిగత భద్రత కూడా కల్పించాలని గురువారం తాజాగా ఆదేశించారు. మార్చి 14వ తేదీ వరకు మణిరత్నం ఇంటికి, కార్యాలయానికి భద్రత కల్పించాలని పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

    బుధవారం మణిరత్నంపై చెన్నై నగర పోలీసు కమీషనర్‌కి మన్నన్‌ అనే పంపిణీదారుడు ఫిర్యాదు చేశారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం కడల్‌ (తెలుగులో కడలి) ఈ నెల 1న విడుదలైంది. ఆ చిత్రం పంపిణీ మూలంగా భారీగా నష్టపోయామని మణి ఇంటి ఎదుట పంపిణీదారులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.

    ఆ పిర్యాదులో... ''రూ.16 కోట్లు వెచ్చించి కొంటే రూ.3.2 కోట్లు మాత్రమే వచ్చింది. కడల్‌ చిత్రాన్ని పంపిణీకి ముందు ఓసారి చూపించమని కోరితే సాంకేతిక కారణాల వల్ల కుదరదని మణిరత్నం మేనేజర్‌ తెలిపారు. దర్శకుడిపై నమ్మకంతో కొన్నాను. నష్టం గురించి ఆయనతో చర్చించాలని పలుమార్లు ప్రయత్నించాను. భేటీ కుదరలేదు. నష్టపోయిన మొత్తాన్ని ఇప్పించాలి''అని ఆ ఫిర్యాదులో మన్నన్‌ పేర్కొన్నారు.

    English summary
    The Madras high court on Thursday directed police to provide personal security cover to the film director Mani Ratnam at his cost. Justice S Rajeswaran said, "I am unable to accept the contention of the advocate general that pursuant to assessment of threat perception of the individual person, police protection would be provided to both the petitioner's residence and office." "The petitioner is a bigwig with a social status in the society and hence he has come to the court seeking police protection to his life and liberty and that of his family members," the court said and directed that one personal security be provided to the film-maker to safeguard him and his family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X