twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూర్య ‘కాప్పన్’ కాపీ వివాదంపై మద్రాస్ హైకోర్ట్ కీలక తీర్పు

    |

    సూర్య నటించిన గత చిత్రం ఎన్.జి.కె బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఈ నేపథ్యంలో ఆయన తన తాజా మూవీ 'కాప్పన్'పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ చేస్తుందనే నమ్మకంతో చిత్ర బృందం ఉంది. కెవి ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ లాల్, ఆర్య, సాయేషా సైగల్, బోమన్ ఇరానీ, చిరాగ్ జైన్, పూర్ణ, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

    కొన్ని నెలల క్రితం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలనపుడే... ఫిల్మ్ మేకర్ జాన్ చార్లెస్ ఈ కథ తనదే అని, కెవి ఆనంద్ కాపీ కొట్టి తీశారంటూ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు గురువారం(సెప్టెంబర్ 12)న మద్రాస్ హైకోర్టులో విచారణకు వచ్చింది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఈ కేసు కోర్ట్ కొట్టివేసింది.

    Madras High Court dismisses Kaappaan plagiarism case

    దీంతో సినిమా విడుదలకు ముందే అన్ని అవాంతరాలు తొలగిపోయినట్లయింది. ఈ నేపథ్యంలో కాప్పన్ చిత్రాన్ని సెప్టెంబర్ 20న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో 'బందోబస్త్' పేరుతో విడుదల కానుంది.

    జాన్ చార్లెస్ తన పిటీషన్లో.. సారావేది అనే స్క్రిప్టును జనవరి 2017లో కెవి ఆనంద్‌కు వినిపించాను, అప్పటి నుంచి అతడి నుంచి రిప్లై కోసం ఎదురు చూశాను. అయితే 'కాప్పన్' ట్రైలర్ విడుదలైన తర్వాత తన కథను పోలి ఉండటం చూసి షాకయ్యాను' అని పేర్కొన్నారు. తన కథను వాడుకున్నందున్న కాపీ రైట్ ఫీజు చెల్లించడంతో పాటు, తనకు క్రెడిట్ ఇవ్వాలని చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ వారిని డిమాండ్ చేశాడు.

    కాప్పన్‌లో మోహన్‌లాల్ ప్రధాని చంద్రకాంత్ వర్మ పాత్రలో, సూర్య ఎన్‌ఎస్‌జి అధికారి కతీర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం రెండు పాత్రల మధ్య జరిగే కథను వివరిస్తూ ఆసక్తికరంగా సాగనుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రేమ్, తలైవాసల్ విజయ్, శంకర్ కృష్ణమూర్తి, యాంకర్ అనిత సహాయక పాత్రల్లో నటించారు. యాక్షన్ థ్రిల్లర్‌‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం హారిస్ జయరాజ్, సినిమాటోగ్రాఫర్‌గా అభినందన్ రామానుజం, ఎడిటర్‌గా ఆంథోనీ పని చేస్తున్నారు.

    English summary
    Madras High Court dismisses Kaappaan plagiarism case it citing lack of evidence. Kaappaan written and directed by K. V. Anand and co-written by Pattukkottai Prabakar. It is produced by Lyca Productions and stars Suriya, Mohanlal, Arya and Sayyeshaa. The film will be released theatrically on 20 September 2019 along with a Telugu dubbed version titled Bandobast.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X