twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెరియార్‌-రజినీ వివాదం.. ఆ సంస్థపై మద్రాస్ హైకోర్ట్ ఫైర్

    |

    ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌పై సూపర్ స్టార్ రజినీ కాంత్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమరాన్ని లేపాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే రజినీ వ్యాఖ్యలపై పెరియార్ అనుచరలు కొంతమంది హైకోర్టు మెట్లెక్కారు. రజనీకాంత్‌పై చర్యలు తీసుకునేలా చెన్నై పోలీసులను ఆదేశించాలంటూ 'ద్రావిడర్‌ విడుదలై కళగం' మద్రాసు హైకోర్టులో పిటీషన్ వేసింది.

    అలా మొదలైంది..

    అలా మొదలైంది..

    ఇటీవల చెన్నైలో జరిగిన తుగ్లక్ పత్రిక 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో రజినీ మాట్లాడుతూ.. ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. 1971లో సేలంలో నిర్వహించిన ఓ ర్యాలీని గుర్తు చేశాడు. అప్పట్లో పెరియార్‌ సీతా రాముల ప్రతిమలను నగ్నంగా తీసుకెళ్లారని రజనీ వ్యాఖ్యానించారు.ఇది అప్పట్లో బయటకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తపడిందని చెప్పుకొచ్చాడు.

    రజినీపై కేసులు..

    రజినీపై కేసులు..

    దీనిపై ద్రావిడర్‌ విడుదలై కళగం నేతలు రజినీపై ఫైర్ అయ్యారు. తన వ్యాఖ్యలతో పెరియార్ గౌరవ ప్రతిష్ఠకు భంగం కలిగించారని రజినీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళగం అధ్యక్షుడు కొళత్తూర్‌ మణి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెరియార్‌ను కించపరిచిన రజనీకాంత్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాగా ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

    Recommended Video

    Darbar Pre Release Event : Telugu People Only Accepts Good Content Films Says Rajinikanth
    క్షమాపణలకు నో..

    క్షమాపణలకు నో..

    సంఘ సంస్కర్త ఈవీ రామస్వామి పెరియార్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్పష్టం చేశాడు. తాను చదివిన వార్తాంశాల ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేశానని ఆయన వివరణ ఇచ్చుకున్నాడు.

     హైకోర్టు ఫైర్...

    హైకోర్టు ఫైర్...

    అయితే, ఎఫ్ఐఆర్‌ నమోదుకు కానీ, ఫిర్యాదు చేసినట్టు రిసిప్ట్ ఇచ్చేందుకు కానీ పోలీసు అధికారులు నిరాకరించినట్టు ఆ సంస్థ చెన్నై జిల్లా కార్యదర్శి ఉమాపతి తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టును డీవీకే ఆశ్రయించింది. దీనిపై మేజిస్ట్రేట్‌ కోర్టుకు వెళ్లకుండా హైకోర్టుకు రావాల్సిన అవసరమేంటని డీవీకేపై ఫైర్ అయింది.

    English summary
    Madras High Court Fires On DVK In Rajinikanth And Periyar Issue. recently Rajinikanth Made Sensational Comments On Social Reformer EV Ramaswamy Periyar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X