twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఎన్నికలు చెల్లవు.. విశాల్‌కు మద్రాస్ హైకోర్ట్ షాక్

    |

    టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గొడవలు మీడియా ముందుకు వస్తేనే ఎంతో రచ్చ అయింది. తమిళ నాట అయితే.. ఏకంగా కోర్టు మెట్లు ఎక్కడం, న్యాయస్థానం చీవాట్లు పెట్టడం జరిగింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు విశాల్‌కు ఆయన వర్గానికి మాత్రం పెద్ద షాకే అని చెప్పవచ్చు. అసలేం ఏం జరిగిందో ఓ సారి చూద్దాం..

    నడిగర్ సంఘం ఎన్నికలు..

    నడిగర్ సంఘం ఎన్నికలు..

    గత ఏడాది జూన్‌ 23వ తేదీన నడిగర్‌ సంఘం (దక్షిణ భారత నటీనటుల సంఘం)కు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో నాజర్‌ అధ్యక్షతన పాండవర్‌ పేరుతో ఒక జట్టు, దర్శక, నటుడు కే.భాగ్యరాజ్‌ అధ్యక్షతన స్వామి శంకరదాస్‌ పేరుతో ఒక జట్టు పోటీ చేశాయి.

    ఓటు హక్కు రద్దు చేయడంతో..

    ఓటు హక్కు రద్దు చేయడంతో..

    ఎన్నికలు జరిగినా ఓట్ల లెక్కింపు మాత్రం జరగలేదు ఎందుకంటే.. తమకు ఓటు హక్కును రద్దు చేయడంతో ఎన్నికలను బహిష్కరించాలని సంఘ సభ్యులు బెంజిమెన్, ఏలుమలై మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సంఘ నిర్వాకంలో పలు అవకతవకలు జరిగాయని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నికల గడువు పూర్తయిన ఆరు నెలల తరువాత నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపును నిలిపి వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

    విశాల్ రిట్ పిటిషన్..

    విశాల్ రిట్ పిటిషన్..

    పాండవర్‌ జట్టుకు చెందిన నాజర్, విశాల్, కార్తీ తదితరులు సంఘం ఎన్నికలు సక్రమంగానే జరిగాయని, సంఘం నుంచి అర్హత లేని సభ్యులనే తొలగించామని, కాబట్టి ఓట్ల లెక్కింపునకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ రిట్‌ పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేశారు. ఎన్నికల వ్యవహారం కోర్టులో ఉండడంతో ప్రభుత్వం సంఘ నిర్వహణ బాధ్యతల కోసం ప్రత్యేక అధికారిని నియమించింది. ఆ అధికారి నియమాకాన్ని వ్యతిరేకిస్తూ విశాల్‌ వర్గం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

    Recommended Video

    Nadigar Sangam Election 2019 : Bharathi Raja controversial comments On Vishal || Filmibeat Telugu
    తీర్పిచ్చిన మద్రాస్ హైకోర్ట్..

    తీర్పిచ్చిన మద్రాస్ హైకోర్ట్..


    ఇలా ఎన్నికలపై నమోదైన పిటిషన్లపై పలు దఫాలుగా కోర్టు విచారణ జరిపింది. అన్ని పిటిషన్లపై తీర్పును శుక్రవారం వెలువరించింది. నడిఘర్ సంఘం ఎన్నికలు చెల్లదని, గడువు పూర్తి అయిన తరువాత ఎన్నికలు నిర్వహించడం చట్ట విరుద్ధమని తెలిపింది. సంఘానికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, ఆదీ మూడు నెలల్లో నిర్వహించాలని ఆదేశించింది. సంఘం సభ్యుల పట్టికను కొత్తగా తయారు చేయాలని, ఎన్నికల పర్యవేక్షణకు పూర్వ న్యాయమూర్తి గోకుల్‌దాస్‌ను నియమిస్తున్నట్లు పేర్కొంది. అప్పటి వరకూ ఎన్నికల అధికారిణిగా గీతనే సంఘం బాధ్యతలను నిర్వహిస్తారని న్యాయస్థానం పేర్కొంది.

    English summary
    madras high court Fires On Nadigar Sangam Election. Court Ordered That Elections Should Be Conducted Again With In 3 Months.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X