Mark Antony హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట!
తమిళంలో యువ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన నటించిన తాజా చిత్రం మార్క్ ఆంటోని సినిమా రిలీజ్‌పై విధించిన ఆంక్షలను కోర్టు ఎత్తివేసింది. దాంతో ఈ సినిమా రిలీజ్‌కు మార్గం సుగమం కావడంతోపాటు విశాల్‌కు భారీ ఉపశమనం లభించింది. లైకా ప్రొడక్షన్స్, మరో సినీ నిర్మాణ సంస్థతో ఉన్న ఆర్థిక వ్యవహారాల కారణంగా ఈ సినిమా రిలీజ్ నిలిపివేయాలంటూ మద్రాస్ కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వివరాల్లోకి వెళితే..
మార్క్ ఆంటోని సినిమా విషయానికి వస్తే.. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా పాటలకు, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రంలో విశాల్‌తోపాటు ఎస్‌జే సూర్య, రితూ వర్మ, సునీల్, సెల్వ రాఘవన్, అభినయ, కింగ్స్‌లే, వైజీ మహేంద్రన్ తదితరులు నటించారు.

మార్క్ ఆంటోని సినిమాను సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే లైకా ప్రొడక్షన్స్ జారీ చేసిన పిటిషన్‌తో ఈ సినిమా రిలీజ్ నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాంతో ఈ సినిమా రిలీజ్ అవుతుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే వివాదం వెనుక అసలు కారణం విశాల్ ఓ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని కోర్టు అభిప్రాయపడింది.
తమిళంలో గోపురం ఫిల్మ్స్‌కు చెందిన అంబు ఛేంజియన్‌తో భవిష్యత్‌లో రూపొందించే సినిమా హక్కులు ఇచ్చేలా విశాల్ ఒప్పందం చేసుకొన్నాడు. అయితే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి లైకాతో విశాల్ ఒప్పందం కుదుర్చుకొన్నారు. దాంతో గోపురం, లైకా మధ్య వివాదం నెలకొన్నది. దాంతో విశాల్ నుంచి రావాల్సిన 21 కోట్లు చెల్లించాలనే లైకా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాంతో విశాల్‌కు కోర్టు నోటీసులు పంపినా సమాధానం లేకపోవడంతో మార్క్ ఆంటోని సినిమా రిలీజ్‌పై స్టే విధించింది.

అయితే సెప్టెంబర్ 12వ తేదీన మద్రాస్ హైకోర్టుకు విశాల్ వెళ్లి తన అడ్వకేట్ చేత వాదనలను వినిపించారు. అయితే విశాల్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందిన కోర్టు.. మార్క్ ఆంటోని సినిమా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్‌పై ఉన్న స్టేను ఎత్తివేయడమే కాకుండా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చింది. దాంతో మార్క్ ఆంటోని సినిమా తెలుగు, తమిళంలో 15వ తేదీన, హిందీలో 22 సెప్టెంబర్ రోజున రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











