చిరంజీవిపై పరువునష్టం దావా.. మన్సూర్ ఆలీఖాన్‌కు కోర్టు చివాట్లు.. భారీ జరిమానా?
దక్షిణాది సినీ నటి త్రిషా కృష్ణన్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకొన్న నటుడు మన్సూర్ ఆలీఖాన్‌కు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన లియో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ప్రైవేట్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. త్రిషపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం లేపాయి. దాంతో మెగాస్టార్ చిరంజీవి, రోజా లాంటి తారలు ఖండించారు. అయితే ఈ వ్యవహారంలో చిరంజీవిపై పరువు నష్టం దావా వేసిన ఆయనకు చెన్నై కోర్టు మొట్టికాయలు వేసి జరిమానా విధించింది. ఆ వివాదం వివరాల్లోకి వెళితే..
లియో సినిమాలో నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ ఓ కీలక పాత్రలో కనిపించాడు. అయితే ఈ సినిమాలో నాకు వేషం ఆఫర్ చేసినప్పుడు త్రిష ఉంటుందని చెప్పారు. దాంతో త్రిషతో నాకు రేప్ సీన్ ఉంటుందని అనుకొన్నాను. కానీ నాకు ఆ అవకాశం దర్శక, నిర్మాతలు ఇవ్వలేదు అని మన్సూర్ ఆలీ ఖాన్ అన్నారు.

అంతేకాకుండా కశ్మీర్‌లో షూటింగ్ చేశాను. కానీ విజయ్‌తో కాంబినేషన్లు చేశాను. కానీ త్రిషతో కలిసి నటించే అవకాశం దక్కలేదు. కనీసం షూటింగ్ సమయంలో త్రిషను కూడా చూపించలేదు అంటూ చిత్ర యూనిట్‌పై అసంతృప్తిని వెళ్లగక్కాడు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలను చిరంజీవి, కుష్బూ తదితరులు ఖండించారు.
అయితే త్రిష వివాదం పెద్దది కావడంతో మన్సూర్ ఆలీ ఖాన్ ఇరుకున పడ్డాడు. ఈ వివాదంలో నా వెర్షన్ కూడా తీసుకొని ఉండాల్సింది. అలా ఏకపక్షంగా చిరంజీవి నాపై నిందలు ఎలా వేస్తారు. నా పరువుకు భంగం కలిగించేలా ట్వీట్ చేశారు. ఆయనపై నేను పరువు నష్టం దావా వేస్తానని కోర్టును ఆశ్రయించారు.
త్రిష వివాదంలో చిరంజీవి, కుష్బూ తనను వేధించారు. దాని వల్ల నా పరువుకు భంగం వాటిల్లింది. కాబట్టి వారిద్దరూ నాకు కోటి రూపాయలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని మన్సూర్ ఖాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు మండిపడింది. నీవు పరువు నష్టం దావా వేసినట్టు లేదు. ఈ వ్యవహారాన్ని పబ్లిసిటి కోసం వాడుకొంటున్నట్టు ఉంది అంటూ మొట్టికాయలు వేసింది.
మన్సూర్ ఆలీ ఖాన్‌ను చివాట్లు పెట్టడమే కాకుండా ఘాటుగా మందలిచింది. ఈ వ్యవహారంలో కోర్టు సమయాన్ని వృథా చేసినందున లక్ష రూపాయల జరిమానాను మద్రాస్ హైకోర్టు విధించింది. ఆ జరిమానా మొత్తాన్ని అడయార్ క్యాన్సర్ ఇన్సిట్యూట్‌కు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.


Click it and Unblock the Notifications











