మగధీర రీ-మేక్ కాదు డబ్బింగే
రామ్ చరణ్, కాజల్ జంటగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర' సినిమా టాలీవుడ్ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసి, తాజాగా తమిళంలో తన ప్రతాపాన్ని చూపడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాని తొలుత రీ-మేక్ చేస్తారనీ, అజిత్ ఈ సినిమా హక్కుల కోసం తెగ ప్రయత్నాలు చేసాడనీ వార్తలు వచ్చాయి. కానీ తాజా వార్త ఎంటంటే ఈ సినిమాని తమిళంలోకి డబ్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. శ్రీహరి పోషించిన షేర్ ఖాన్ పాత్రను ఓ ప్రముఖ తమిళ నటుడితో చిత్రీకరించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కథానాయిక కాజల్ కూడా తమిళ తంబిలకు సుపరిచయమే కాబట్టి పెద్దగా ఇబ్బంది వుండదు అని అల్లు అరవింద్ భావిస్తున్నారట.
అన్నీ కుదిరితే ఈ సినిమాని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. తమిళంలో సంక్రాంతికి విజయ్, అజిత్ ల సినిమాలు విడుదల కానున్నాయి. సో మన మగధీరుడు తమిళ హీరోలకు గట్టి పోటీని ఇవ్వనున్నాడన మాట.


Click it and Unblock the Notifications











