స్త్రీలను గౌరవించండి: దర్శకులు, హీరోలపై జ్యోతిక సంచలన కామెంట్స్
హీరోయిన్లను గౌరవంగా చూపించండి అంటూ ఈ తరం దర్శకులు, కొందరు హీరోల తీరును ఈ సందర్భంగా జ్యోతిక ఎండగట్టారు.
హైదరాబాద్: ప్రముఖ నటి, హీరో సూర్య సతీమని జ్యోతిక తాజాగా తమిళ సినీ వేడుకలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. హీరోయిన్లను గౌరవంగా చూపించండి అంటూ ఈ తరం దర్శకులు, కొందరు హీరోల తీరును ఈ సందర్భంగా జ్యోతిక ఎండగట్టడం గమనార్హం.
సినిమాల్లో హీరోయిన్లను హీనంగా చూపించడాన్ని ఆమె తప్పు బట్టారు. ఇలాంటి సినిమాలను తీస్తున్న దర్శకులను, అలాంటి సినిమాలకు ఓకే చెబుతున్న హీరోలను కూడా ఆమె కడిగి పారేసారు. జ్యోతిక ప్రధాన పాత్రలో బ్రహ్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మగళిర్ మట్టుమ్' సినిమా ఆడియో వేడుకలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసారు.

అది ఒక బ్రహ్మకే చెల్లింది
జ్యోతిక మాట్లాడుతూ... ‘హీరోయిన్ల అసలు వయస్సు కంటే తక్కువ వయస్సుతో పాత్ర సృష్టించిన దర్శకుడు బ్రహ్మా మాత్రమే. 30 ఏళ్లు దాటితే పాత హీరోయిన్లుగా పరిగణించేస్తున్నారు. కానీ ఈ చిత్రం లతనకు యూత్‌ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు, ఆయనకు థాంక్స్ చెబుతున్నాను అని జ్యోతిక తెలిపారు.

హీరోయిన్లను హీనంగా చూపించొద్దు
ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్లను చాలా హీనంగా చూపిస్తున్నారు. స్త్రీలను అగౌరవంగా చూపే అలాంటి సీన్లు మన సినిమాల్లో లేక పోవడమే మంచిదని జ్యోతిక అభిప్రాయ పడ్డారు. స్త్రీల గౌరవం పెంచే విధంగా హీరోయిన్ల పాత్రలు ఉండాలని జ్యోతిక అన్నారు.

తల్లి, చెల్లి, భార్యను దృష్టిలో పెట్టుకోండి
హీరోయిన్లకు సంబంధించిన పాత్రలు రాసే టపుడు తల్లి, చెల్లి, భార్య లాంటి వారిని దృష్టిలో పెట్టుకుండి. స్త్రీలను అగౌరవ పరిచే విధంగా పాత్రలు రాస్తే... వారిని కూడా అగౌరవ పరిచినట్లే అని జ్యోతిక అభిప్రాయ పడ్డారు.

అభిమానులు అలాగే తయారవుతారు
హీరోలు కూడా స్త్రీలను అగౌరవంగా చూపే పాత్రలను ప్రోత్సహించక పోవడమే మంచిది. హీరోలకు భారీగా అభిమానులుంటారు. ఒక సినిమాలో ఒక హీరోకి నలుగురు హీరోయిన్లు ఉంటే... వారి అభిమానులు కూడా అలాగే ఆలోచించి ముగ్గురు, నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ కావాలనుకోరా? అంటూ తదనతైన శైలిలో జ్యోతిక జ్యోతిక ప్రశ్నించారు.
మగళిర్ మట్టుమ్
మగళిర్ మట్టుమ్ సినిమాను నిర్మిస్తుంది మరెవరో కాదు... జ్యోతిక భర్త, ప్రముఖ హీరో సూర్య. ఈ సినిమాలో జ్యోతిక బైక్ రైడ్ చేస్తూ కనిపిస్తుంది. ఈ బైక్ రైడ్ కూడా ఆమెకు సూర్యనే నేర్పించాడు.


Click it and Unblock the Notifications











