'బాహుబలి'కి అక్కడ కూడా భారీ రెస్పాన్స్
చెన్నై : 'నాన్ ఈ' (ఈగ) చిత్రంతో తమిళ తంబిలని సైతం ఆకట్టుకున్న దర్శకుడు రాజమౌళి. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం 'బాహుబలి'. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్ - మేకింగ్ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.
ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. అనుష్క ముఖ్యపాత్ర పోషిస్తోంది. రాణా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు ఇతర తారాగణం. విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. అనుష్క కి తమిళనాట కూడా మంచి మార్కెట్ ఉండటం కూడా సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. అలాగే సత్యరాజ్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్ర చేయటం కలసివచ్చే అంశం.
అనుష్క మాట్లాడుతూ.. ''రాజమౌళి సినిమాల్లో నటించాలంటే నాకు చాలా ఇష్టం. అది కొంచెం కష్టం కూడా! తెరపై చూసినప్పుడు ఆ కష్టం తొలగిపోతుంది. నా పాత్రకు మంచి స్పందన వస్తుంది''అని పేర్కొంది. ఇందులో అనుష్క దేవసేన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. రెండురోజుల క్రితం అనుష్క పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక టీజర్‌ను కూడా విడుదల చేశారు. చరిత్రాత్మక కథతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం భారీఎత్తున రూ.కోట్ల విలువైన సెట్లను వేస్తున్నారు సాబు శిరిల్.


Click it and Unblock the Notifications












