విజయ్ సేతుపతికి అన్యాయం? మహరాజ హిట్టైనా నిర్మాత ఏమీ ఇవ్వలేదా?
నటన అంటే ఇండియన్ సినిమా దగ్గర తమిళ ఇండస్ట్రీకి చెందిన నటులే మొదటిగా గుర్తొస్తారు. సినిమాల్లో పాత్రల కోసం శరీరాన్ని హూనం చేసుకునే స్థాయికి తమిళ హీరోలకి మంచి పేరుంది. అయితే వీరిలోనే స్వశక్తితో ఇండస్ట్రీలో ఎదిగిన మరో నాచురల్ పర్ఫార్మర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అని చెప్పాలి. విలన్ గా విజయ్ సేతుపతి తన నటనతో ఎన్నో సినిమాల్లో అదరగొట్టాడు.
కానీ హీరోగా మాత్రం మరీ అంత సక్సెస్ కాలేదు. ఇలా హీరోగా విలన్ గా చిన్న చిన్న పాత్రలు అన్నీ కలిపి చేసి తన 50వ సినిమాకి సేతుపతి చేరుకున్నాడు. అలా తాను చేసిన 50వ సినిమానే "మహారాజ". దర్శకుడు నిథిలన్ తో చేసిన ఈ ఇంటెన్స్ ఎమోషనల్ మరియు రివెంజ్ డ్రామా ఓ హీరో కెరీర్ లో బెంచ్ మార్క్ సినిమాగా ఎలాంటి సినిమా కావాలో అలాంటి హిట్ అయ్యి కాసుల వర్షాన్ని కురిపించింది.

కాగా ఈ చిత్రం గత జూలైలో థియేటర్స్ లోకి రాగా ఇక్కడ నుంచి ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యి తమిళ్ సహా తెలుగులో కూడా నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి లాభాలు అందించింది. కాగా ఈ సినిమా తాజాగా 100 రోజుల రన్ ని పూర్తి చేసుకోగా మేకర్స్ 100 రోజుల ఈవెంట్ ని చేసుకున్నారు అయితే ఈ సినిమా నిర్మాతలు సుదన్ సుందరం, జగదీశ్ పలని స్వామిలు మహారాజ ఇంత పెద్ద సక్సెస్ సాధించినందుకు చిత్ర యూనిట్ కి మంచి బహుమతులే అందించారట.
కాగా మొదటిగా దర్శకుడికి ఖరీదైన లేటెస్ట్ బీఎండబ్ల్యూ లగ్జరీ కార్ ని వారు గిఫ్ట్ ఇచ్చారు. అలాగే సినిమా ఇతర నటీనటులకు ఐఫోన్ లేటెస్ట్ ఎడిషన్ ని బహుమానంగా అందించారట. అలాగే సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ అందరికీ లక్ష చొప్పున నగదు అందించి వారి కష్టానికి తగిన బహుమానం అందించినట్టుగా కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
#Maharaja 100th Day Celebration... #VJS - #JayamRavi pic.twitter.com/grwOauqjBM
— Rajasekar Russalayan (@iamrajesh_pov) October 6, 2024
కానీ అందరికీ అన్ని చేశారు కానీ అసలు సినిమాలో తన పెర్ఫామెన్స్ తో సినిమా ప్రాణం పోసిన హీరో విజయ్ సేతుపతికి ఏదన్నా ఇచ్చినట్టుగా ఎలాంటి వార్త తమిళ సినీ వర్గాల్లో లేదు. దీనితో సినిమా హీరోకే అన్యాయం చేసారా అనే టాక్ వినిపిస్తుంది. అయితే ఆ మధ్య విజయ్ సేతుపతి తన రెమ్యునరేషన్ కోసం ఎక్కడా ఓపెన్ గా చెప్పలేదు.

మరి బహుశా మేకర్స్ ఎక్కువ రెమ్యునరేషన్ నే అప్పుడు ఇచ్చి ఉండొచ్చు అందుకే ఈసారి తనకి మినహా మెగా యూనిట్ అందరికీ ఖరీదైన బహుమతులు అందించారని అనుకోవాలి. కాగా ఈ సినిమా థియేటర్స్ లో 100 కోట్లకి పైగా వసూళ్లు సాధించి అదరగొట్టింది. ఈ తర్వాత ఓటిటిలోకి వచ్చిన తర్వాత కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ ని అందుకుంది. అలాగే ఇప్పటికీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో మహారాజ సినిమా టాప్ 10 లో ఇండియా వైడ్ ట్రెండింగ్ లిస్ట్ లో ట్రెండ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











