సీక్రెట్‌గా హీరో పెళ్లి నిశ్చితార్థం.. తాప్సీకి గుడ్‌బై చెప్పి.. పెళ్లికి ముందే గర్ల్‌ఫ్రెండ్‌తో

Recommended Video

Mahat Raghavendra Got Engaged To His Girlfriend Prachi Mishra || Filmibeat Telugu

తమిళ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ మహత్ రాఘవేంద్ర వివాహ నిశ్చితార్థం చెన్నైలో ఘనంగా జరిగింది. గత కొద్దికాలంగా అఫైర్ సాగిస్తున్న ప్రాచీ మిశ్రాతో వివాహం చేసుకొనేందుకు నిర్ణయించుకోవడం గమనార్హం. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల మద్దతు తెలపడంతో పెళ్లికి లైన్ క్లియర్ అయింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో మహత్ రాఘవేంద్, ప్రాచీ ఎంగేజ్‌మెంట్ జరిగింది. వివరాల్లోకి వెళితే...

ప్రాచీ మిశ్రాతో ఎంగేజ్‌మెంట్

ప్రాచీ మిశ్రాతో ఎంగేజ్‌మెంట్

ప్రాచీ మిశ్రాతో తన ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని మహత్ రాఘవేంద్ర సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కొద్దికాలంగా ప్రేమలో ఉన్న నా ప్రియురాలిని పెళ్లి చేసుకొంటున్నట్టు మహత్ తెలిపారు. అతికొద్ది సన్నిహితుల మధ్య 17వ తేదీన ఎంగేజ్‌మెంట్ జరిగింది అని మహత్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఎంగేజ్డ్ అంటూ కామెంట్ పెట్టారు.

సంప్రదాయ దుస్తుల్లో మహత్, ప్రాచీ

సంప్రదాయ దుస్తుల్లో మహత్, ప్రాచీ

ఎంగేజ్‌మెంట్ కార్యక్రమంలో మహత్, ప్రాచీ సంప్రదాయ దుస్తులు ధరించారు. తెల్లటి సిల్క్ షర్ట్, ధోతిలో మహత్, పసుపు పచ్చ చీరలో ప్రాచీ ముస్తాబయ్యారు. అయితే ఇంకా పెళ్లి తేదీని ఖారారు చేయలేనట్టు తెలిసింది. త్వరలోనే మ్యారేజ్ డేట్‌ను ఫిక్స్ చేసే అవకాశం ఉందని సన్నిహితులు తెలిపారు.

 మహత్, ప్రాచీ మిశ్రా మధ్య విభేదాలు

మహత్, ప్రాచీ మిశ్రా మధ్య విభేదాలు

బిగ్‌బాస్‌లో మహత్ రాఘవేంద్ పాల్గొన్నప్పుడు వీరిద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకొన్నాయి. బిగ్‌బాస్ షోలో ఉండగా, మరో కంటెస్టెంట్ యషికా ఆనంద్‌కు లవ్ ప్రపోజల్ చేశాడు. దాంతో ప్రాచీ, మహత్ మధ్య బ్రేకప్ జరిగినంత పనైంది. అంతా వీరి కథ కంచికి చేరిందనే మాటలు తమిళ పరిశ్రమలో వినిపించాయి.

బిగ్‌బాస్ నుంచి ఎలిమినేషన్ తర్వాత

బిగ్‌బాస్ నుంచి ఎలిమినేషన్ తర్వాత

అయితే అనుహ్యంగా వీరిద్దరి మధ్య రిలేషన్ మళ్లీ చిగురించింది. బిగ్‌బాస్ నుంచి మహత్ ఎలిమినేషన్ జరిగిన తర్వాత మహత్, ప్రాచీ తమ విభేదాలను పరిష్కరించుకొన్నారు. తర్వాత మళ్లీ తమ ప్రేమను పట్టాలెక్కించారు. ఇటీవల గుల్ మార్గ్, కశ్మీర్‌లో విహార యాత్ర చేశారు. తర్వాత పెళ్లి చేసుకోవాలనే నిర్ణయంతో వారికి నిశ్చితార్థం జరిగింది.

హీరోయిన్ తాప్సీతో రిలేషన్‌షిప్

హీరోయిన్ తాప్సీతో రిలేషన్‌షిప్

గతంలో తాప్సీ పన్నుతో మహత్ రాఘవేంద్ర రిలేషన్‌షిప్‌ ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. వారిద్దరూ సన్నిహితంగా కలిసి కనిపించిన దాఖలాలు ఉన్నాయి. ఆ తర్వాత విభేదాల కారణంగా తమ రిలేషన్‌కు గుడ్‌బై చెప్పారు. ఇలా పలురకాల తారలతో అఫైర్లు కొనసాగించిన మహత్ చివరకు ప్రాచీతో జీవితాన్ని పంచుకొనేందుకు రెడీ అయ్యాడు.

మహత్ రాఘవేంద్ర కెరీర్ గురించి

మహత్ రాఘవేంద్ర కెరీర్ గురించి

మహత్ రాఘవేంద్ర కెరీర్ విషయానికి వస్తే.. అజిత్ నటించిన మంకథ చిత్రంలో కనిపించాడు. తెలుగులో బ్యాక్ బెంచ్ స్టూడెంట్, బన్నీ అండ్ చెర్రీ, లేడీస్ అండ్ జెంటిల్మన్, రన్ చిత్రాల్లో నటించాడు. ఇటీవల తమిళ బిగ్‌బాస్2లో పాల్గొని టెలివిజన్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X