చిట్టికి ఫిదా అయిన మహేష్ బాబు.. నా కూతురి కోసం 3.0 అంటున్న అల్లరి నరేష్!

దిగ్గజ దర్శకుడు శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన 2.0 చిత్రం సంచలనాలు మొదలుపెట్టింది. సినీ ప్రముఖులంతా శంకర్ విజువల్ వండర్ 2.0 కు ఫిదా అవుతున్నారు. హీరోలు, నటులు, దర్శకుడు, హీరోయిన్లు ఇలా వరుసగా 2.0 చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిత్రానికి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తుండడంతో వసూళ్లు కూడా జోరందుకుంటున్నాయి. తాజాగా శుభాకాంక్షలు తెలియజేసిన సెలెబ్రిటీలందరికి దర్శకుడు శంకర్ కృతజ్ఞతల తెలిపారు.

Recommended Video

#2point0 : Celebrity Tweets And Reactions On Robo 2.O | Filmibeat Telugu

సినిమాటిక్ జెమ్

సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా 2.0 చిత్రంపై స్పందించారు. ఈ చిత్రాన్ని మహేష్ సినిమాటిక్ జెమ్ అని అభివర్ణించాడు.ఇంతకు ముందెన్నడూ చూడని అనుభూతిని పొందుతారు. దర్శకుడు శంకర్ సత్తా మరో స్థాయికి చేరింది. ఈ చిత్రాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశా. రజనీకాంత్, అక్షయ్ కుమార్, చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు అని మహేష్ ట్వీట్ చేశాడు.

స్పందించిన శంకర్

మహేష్ ట్వీట్ కు దర్శకుడు శంకర్ స్పందించారు. థాంక్స్ మహేష్ గారు అంటూ రిప్లై ఇచ్చారు. 2.0 చిత్రం విజయం సాధించినందుకు శుభాంక్షలు తెలియజేసిన ప్రతి సెలెబ్రిటీకి శంకర్ ధన్యవాదాలు తెలిపాడు. దర్శకుడు అట్లీ, అల్లరి నరేష్, నాని ఇలా చాలా మంది సెలెబ్రిటీలు 2.0 చిత్రంపై ప్రశంసలు కురిపించారు. 2.0 చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులు, సహకరించిన మీడియాకు శంకర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ అని శంకర్ ట్వీట్ చేశారు.

నా కూతురి కోసం 3.0

ఇండియన్ సినిమా భవిష్యత్తుని ఇప్పుడే చూపించిన శంకర్ గారికి కృతజ్ఞతలు. రజనీకాంత్ ఎనర్జీ, అక్షయ్ కుర్ నటన ఈ చిత్రంలో ఆకట్టున్నాయి. చిట్టి ఎప్పటికి ప్రత్యేకమే. నా కూతురి కోసం చిట్టి 3.0 ని తీసుకుని వెళతా అంటూ అల్లరి నరేష్ ట్వీట్ చేశారు. అల్లరి నరేష్ ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

శంకర్‌కు సెల్యూట్

2.0 చిత్రంపై సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కూడా స్పందించారు. 2.0 క్రియేషన్ ఒక అద్భుతం అని అన్నారు. సోషల్ మెసేజ్, అద్భుతమైన గ్రాఫిక్స్ కలగలిపి ఉన్నాయి. రజనీకాంత్ కు తిరుగులేదు, శంకర్ కు సెల్యూట్ అంటూ సిమ్రన్ ట్వీట్ చేశారు. నా పిల్లలతో కలసి ఈ చిత్రాన్ని చూశా. చాలా ఎంజాయ్ చేశా అని సిమ్రన్ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X