తమిళంలో 'దూకుడు' రెడీ, టైటిల్ ఏమిటంటే..

By Srikanya

చెన్నై : శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్‌ నటించిన 'దూకుడు' చిత్రం సూపర్ హిట్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని తమిళంలోకి అనువదించనున్నారు. 'అదిరడి వేట్త్టె' పేరిట వేసవి కానుకగా జనం చెంతకు రానుంది. పలువురు కోలీవుడ్‌ నటులు రీమేక్‌ చేసుకుంటారనే వార్తలు తొలుత వినిపించినా వాటికి చెక్‌ పెడుతూ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి తమిళనాట మంచి బిజినెస్ జరుగుతుందనే భావిస్తున్నారు.

మరో ప్రక్క గతంలో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో నాగార్జున నటించిన 'సూపర్‌'ను అదే పేరుతో ఇక్కడ థియేటర్లలోకి తెస్తున్నారు. ఇక్కడివారికి నాగార్జున సుపరిచితుడు కావటం, ఇదే సినిమాతో తెరంగేట్రం చేసిన అనుష్క ప్రస్తుతం అగ్రస్థానంలో ఉండటం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని తెరపైకి తెస్తున్నారు. ఇది కూడా వేసవి కానుకగానే విడుదలవనుంది.

ఇక దూకుడు చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో ఇదే టీమ్ 'ఆగడు' అనే చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఆగడు సినిమా వివరాల్లోకి వెళితే...దూకుడు చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్నారు. ప్రస్తుతం శ్రీను వైట్ల జూ ఎన్టీఆర్ హీరోగా 'బాద్ షా' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత మహేష్ బాబు-శ్రీను వైట్ల తాజా చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

దూకుడు తరహాలో 'ఆగడు' టైటిల్ క్యాచీగా ఉండటంతో దీన్నే దాదాపుగా ఫైనల్ చేసే అవకాశం ఉంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో సినిమాకు అగ్రిమెంట్ కుదుర్చుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఆ సంస్థ పని తీరు నచ్చడం వల్లనే మహేష్ బాబు వరుసగా ఆ సంస్థ కోసం డేట్స్ ఇస్తున్నారని, పైగా అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు మహేష్‌కు బాగా సన్నిహితులు అవ్వడం కూడా మరోకారణం అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X