మహేష్ బాబుతో కోరిక తీర్చుకోవడానికే ఎక్కువ కాలాన్ని వెచ్చిస్తోంది...!?
బాలయ్యతో చేసిన సింహ విజయానందంలో ఉన్న బారీ అందాల బొద్దుగుమ్మ నమిత ఇప్పుడు తన భారీతనాన్ని తగ్గించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ డైటింగ్ లు...యోగాలు..జిమ్ లలో ఎక్కువసేపు కాలన్ని వెచ్చిస్తోందని సన్నిహితుల చెబుతున్నారు. తమిళనాట తన భారీ అందాలతో అదరకొట్టి ఏకంగా అభిమానులతో గుడినే నిర్మంప చేసుకున్న అమ్మడు నమిత ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబుతో ఓ సినిమా అయినా చేయాలని తెగ ఉబలాట పడిపోతోందట.
ఆంద్రరాష్ట్రమంతా అందగాడిగా చెప్పుకునే ప్రిన్ప్ మహేష్ తో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాని సన్నిహితులతో అన్నట్లు బోగట్ట. ఇప్పటికే ట్విట్టర్లో టచ్ ఉన్నమహేష్, సేమ్ నెట్ వర్క్ల్ లో నమిత ట్విట్టర్ ఓపన్ చేసిన విషయం తెలిసిందే. సో మహేష్ బాబుతో సరిసమానంగా నమితకు కూడా ఫ్యాన్ ఫాలోవర్స్ రిజిస్టర్ చేసుకొంటున్నారని, అందులో చాలా వరకు నమితను మహేష్ బాబుతో నటించాలని ప్రపోజ్ చేస్తున్నారని కూడా సమాచారం. అయితే అమ్మడు భారీ తనాలు తగ్గించుకున్నంత మాత్రాన ప్రిన్స్ తన సరసన అంగీకరిస్తాడా? లేదా? అన్నది, నమిత తన ఫ్యాన్స్ కోరికను, పనిలోపనిగా తన కోరిక నెరవేర్చుకొంటోందో, లేదో అన్నది మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే..


Click it and Unblock the Notifications











