మహేష్ తనతో చేయమని అడుగుతూంటారు కానీ కుదరటం లేదు
మహేష్ బాబు తమ సినిమాకు ఛాయాగ్రహకుడిగా బాధ్యతలు వహించమని తరచూ అడుగుతుంటారు.. కానీ సమయాన్ని కేటాయించలేకపోయాను అంటున్నారు ప్రముఖ ఛాయాగ్రాహకుడు కె.వి ఆనంద్. ఆయన రీసెంట్ గా దర్శకుడు గా మారి రూపొందించన కో చిత్రం ఘన విజయం సాధించింది. ఆ చిత్రం తెలుగులో రంగం గా విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్బంగా ఆయన్ని కలిసిన మీడియాతో ఇలా స్పందించారు. అలాగే పవన్ కల్యాణ్, ఎన్టీఆర్... ఈ హీరోలంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల సినిమాకు పనిచేయాలని ఉన్నా కుదర్లేదు. తెలుగు భాష నేర్చుకోవాలి. అప్పుడే తెలుగు సినిమాల్లో పనిచేయడం గురించి ఆలోచిస్తా అన్నారు. కె.వి ఆనంద్ గతంలో ఛాయాగ్రాహకుడిగా 'పుణ్యభూమి నా దేశం' చిత్రం మాత్రమే చేసారు. ఆ తరవాత తెలుగు సినిమాలకు పనిచేయలేదు.ఇక శంకర్ రూపొందించిన 'ఒకే ఒక్కడు', 'శివాజీ' చిత్రాలకి ఛాయాగ్రహణ బాధ్యతలు అందించారు. త్వరలో సూర్య హీరోగా ఓ చిత్రం రూపొందించనున్నారు. ఈ విషయం తెలియచేస్తూ...'ఈ సినిమాలో కథే హీరో.. రెండో స్థానం మీది..' అని సూర్యకు కూడా ధైర్యంగా చెప్పి ఒప్పించాను అన్నారు.


Click it and Unblock the Notifications











