మహేష్ నెక్ట్స్ ఆ తమిళ దర్శకుడుతో కన్ఫర్మ్
త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న చిత్రం మహేష్ తన తదుపరి చిత్రానికి దర్శకుడుగా లింగు స్వామిని ఎంపికచేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. తమిళంలో శింబు హీరోగా చేసే కథని తెలుగులో మహేష్ తో చేయనున్నారు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ తిరుపతి ప్రసాద్ ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని నిర్మించనున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది. తమిళ వెర్షన్ మాత్రం జూలైనుంచే షూటింగ్ చేస్తారు. ఈ చిత్రం స్క్రిప్టు నిమిత్తం లింగు స్వామి ప్రస్తుతం కూర్గులోని ఆరెంజ్ కంట్రీ అనే రిసార్టులో స్క్రిప్టు వర్క్ చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ...నేను నార్మల్ గా స్క్రిప్టు చేయటానికి ప్రశాంతంగా ఉండే చోటు కావాలనుకుంటాను. ఇప్పుడీ ప్లేస్ నచ్చింది. అలాగే నేను చేయబోయే చిత్రం గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిర్మాత సమక్షంలో వెళ్లడి చేస్తాను అన్నారు. ఇక లింగు స్వామి డైరక్ట్ చేసిన రన్, పందెం కోడి చిత్రాలు తెలుగులో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే అతని తాజా చిత్రం పయ్యా త్వరలో ఆవారా టైటిల్ తో తెలుగులో రిలీజ్ కాబోతోంది.


Click it and Unblock the Notifications











