'అదిరడి వేట్త్టె' గా మహేష్ సూపర్ హిట్
చెన్నై : మహేష్ బాబు చిత్రాలకు తమిళంలోనూ మంచి మార్కెట్ ఉంది. దాన్ని పురస్కరించుకుని అక్కడా భారీ ఎత్తున డబ్ చేసి నిర్మాతలు విడుదల చేస్తున్నారు. తాజాగా . తెలుగులో వసూళ్లవర్షం కురిపించిన శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్‌బాబు నటించిన 'దూకుడు' 'అదిరడి వేట్త్టె'గా తమిళంలోకి అనువాదమవుతోంది. మహేష్ సరసన సమంత ఆడిపాడింది. తమన్ సంగీతం సమకూర్చారు.
ప్రముఖ దర్శకుడు మహేంద్రన్ కుమారుడు జాన్ మహేంద్రన్ మాటలు రాశారు. ప్రజలకు సేవచేసి విశ్వాసపాత్రుడిగా పేరు సంపాదించుకున్న ఎమ్మెల్యేను ప్రత్యర్థులు హతమార్చడం, వారిని ఎమ్మెల్యే కుమారుడు పథకం ప్రకారం తుదముట్టించడం చివరకు తన తండ్రి బతికే ఉన్నారనే నిజాన్ని ప్రత్యర్థులకు తెలియజేయడం వంటి ఆసక్తికరమైన అంశాలతో స్క్రీన్‌ప్లే సినిమా సాగుతుంది. ప్రస్తుతం అనువాద పనులు పూర్తయ్యాయి. వచ్చేనెలలో జనం మధ్యకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక దూకుడు చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో ఇదే టీమ్ 'ఆగడు' అనే చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఆగడు సినిమా వివరాల్లోకి వెళితే...దూకుడు చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్నారు. ప్రస్తుతం శ్రీను వైట్ల జూ ఎన్టీఆర్ హీరోగా 'బాద్ షా' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత మహేష్ బాబు-శ్రీను వైట్ల తాజా చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
దూకుడు తరహాలో 'ఆగడు' టైటిల్ క్యాచీగా ఉండటంతో దీన్నే దాదాపుగా ఫైనల్ చేసే అవకాశం ఉంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో సినిమాకు అగ్రిమెంట్ కుదుర్చుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఆ సంస్థ పని తీరు నచ్చడం వల్లనే మహేష్ బాబు వరుసగా ఆ సంస్థ కోసం డేట్స్ ఇస్తున్నారని, పైగా అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు మహేష్‌కు బాగా సన్నిహితులు అవ్వడం కూడా మరోకారణం అంటున్నారు.


Click it and Unblock the Notifications











