twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'వీరుడు'గా మహేష్ బాబు...డిటేల్స్

    By Srikanya
    |

    మహేష్ బాబు, మణిరత్నం కాంబినేషన్ లో రూపొందనున్న భారీ చిత్రం తెలుగు వెర్షన్ కి వీరుడు అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. త్వరలో ప్రారంభం కానున్న చిత్రంలో మహేష్ తో పాటు తమిళ స్టార్స్ విజయ్, ఆర్య చేయనున్నారు. అలాగా అనూష్క మరో కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని రజనీకాంత్ తో 'రోబో" చిత్రాన్ని నిర్మించి అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన సన్ పిక్చర్స్ తమిళ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. ఇందుకోసం అమర్ కల్కి రచించిన 'పొన్ని యన్‌ సెల్వన్‌" అనే నవలను సన్‌ పిక్చర్స్‌ ఎంచుకుంది. ఐదు సంపుటాల నవలను కేవలం 80 సీన్లతో మణిరత్నం చక్కని స్క్రిప్ట్‌గా మలిచారని సమాచారం.ఇక ప్రస్తుతం మహేష్..శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. మహేష్ సరసన తొలిసారిగా సమంత కనిపించనుంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆచంట గోపీచంద్, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.

    English summary
    Mahesh Babu,Mani Ratnam's multi starrer film has titled "Ponniyin Selvan" in Tamil. Now the latest news is that the movie has titled as "veerudu" for Telugu version.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X