twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళంలో స్వయంగా మహేష్ బాబే

    By Srikanya
    |

    మహేష్ బాబు తన తాజా చిత్రం ది బిజినెస్ మ్యాన్ తమిళంలోనూ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ తన వాయిస్ కు వేరే వారు డబ్బింగ్ చెప్పటం ఇష్టపడని మహేష్ తానే స్వయంగా తమిళంలో డబ్బింగ్ చెప్పుతున్నారు. ఎందుకంటే ఆయన చెన్నైలో చదువుకోవటం వల్ల తమిళం బాగా వచ్చు. ఇక తమిళ,తెలుగు వెర్షన్స్ రెండూ జనవరి 11,2012 నే విడుదల కానున్నాయి. ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం..కొనుగోళ్ళు ..అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది.ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేస్తున్నారు.గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు.ఇక ఈ చిత్రం ముంబై మాఫియాకి చెందిన కథగా తెరకెక్కుతోంది. 'బిజినెస్‌ మ్యాన్‌'గా టైటిల్‌కు తగిన పాత్ర అది.

    పోకిరి తర్వాత అంతటి హిట్‌ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఆయన రూపొందించబోయే చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    Mahesh Babu is a fluent speaker of Tamil and that is the reason he opted to lend his voice to the Tamil version of ‘Businessman’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X