ఆ సినిమా వదలుకున్నందుకు బాధగా ఉంది....మహేష్ బాబు
నేను త్రి ఇడియట్స్ రీమేక్ లో నటించినందుకు, ఆ ఆఫర్ మిస్ చేసుకున్నందుకు బాధ పడుతున్నాను అంటున్నారు మహేష్ బాబు. తనకు డేట్స్ సమస్య వల్ల ఆ సినిమా చేయలేకపోయానని చెప్పుకొచ్చారు. అలాగే తను నిజానికి రీమేక్ లుకు వ్యతిరేకినైనా ఆ రూల్స్ ని బ్రేక్ చేసుకుని చేద్దామనుకున్నా కుదురలేదనన్నారు. తన డేట్స్ మొత్తం దూకుడు కోసం బ్లాక్ అయ్యి ఉన్నాయని అందుకే ఎడ్జెస్ట్ చేయలేకపోయానని చెప్పుకొచ్చారు. అలాగే దూకుడు సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫ్లిక్ అన్నారు. అలాగే నా తండ్రి పుట్టిన రోజున టీజర్ విడుదల చేయటానికి కారణం ఆయన నన్ను బాగా ఇన్సైర్ చేసిన వ్యక్తి అన్నారు. అలాగే తను మణిరత్నం సినిమా మిస్సవటాన్ని కూడా చాలా బాధ కలిగిందని, మణి సార్ ఫోన్ చేసి తాను ఆ ప్రాజెక్టు వదిలేస్తున్నానని చెప్పారని, అంతకుముందు గురు సినిమాలోనూ నాకు ఆఫర్ వచ్చింది కానీ సైనికుడు షూటింగ్ లో బిజిగా ఉండి చేయలేకపోయానని అన్నారు.


Click it and Unblock the Notifications











