సినిమా వివాదం: రజనీకాంత్ కోసం స్పెషల్ షో...
హైదరాబాద్: తన అనుమతి లేకుండా తన పేరును వాడుకుంటున్నారని, తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ‘మై హూ రజనీకాంత్' అంటూ ఓ సినిమాకు టైటిల్ పెట్టిన నేపథ్యంలో రజనీకాంత్ మద్రాసు హై కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.
ఈచిత్రం రజనీకాంత్ జీవిత చరిత్ర గురించి అస్సలుకాదని.....అసలు ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రస్తావ ఉందని, అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా ఎలాంటి సన్నివేశాలు ఉండబోవని దర్శకుడు ఫైజల్ సైఫ్ స్పష్టం చేసారు. కేవలం ఇది వినోదాత్మక చిత్రం, ఎవరినీ ఉద్దేశించి ఈ చిత్రం ఉండదు అంటున్నారు.

రజనీకాంత్ కోర్టను ఆశ్రయించిన నేపత్యంలో.....రజనీకాంత్, ఆయన కూతురు సౌందర్యల కోసం చెన్నైలోని ఏవిఎంలో ‘మై హూ రజనీకాంత్' చిత్రాన్ని స్పెషల్ ప్రవదర్శిస్తున్నట్లు దర్శకుడు ఫైజల్ సైఫ్ తెలిపారు. మరి రజనీకాంత్ సినిమా చూసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
‘మై హూ రజనీకాంత్' అనేది ఓ హిందీ చిత్రం. ఫైజల్ సైఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సరోజ్ నిర్మిస్తున్నారు. ఆదిత్యయ మీనన్, కవితా రాధేశ్యామ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదొక కామెడీ చిత్రం. బప్పి లహరి, సాహిబని కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











