twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజకీయ ఒత్తిడిలో విజయ్ సర్కార్ చిత్తు.. తొలగించనున్న వరలక్ష్మి సీన్స్, పోలిసుల క్లారిటీ!

    |

    Recommended Video

    Sarkar Update : Sarkar Makers To Delete Controversial Scenes

    దళపతి విజయ్ సర్కార్ చిత్రానికి మరో షాక్. ఇప్పటికే అధికార పార్టీ దాడి, కేసులతో సంతమతమవుతున్న చిత్ర యూనిట్ కు ఇది మరో నిరాశ కలిగించే అంశం. సర్కార్ చిత్రంలో అమ్మ జయలలిత, అన్నా డీఎంకే పార్టీ ప్రతిష్ట దిగజార్చే సన్నివేశాలు ఉన్నాయంటూ తీవ్రమైన రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. వరుస వత్తిళ్లు నేపథ్యంలో వివాదాస్పద సన్నివేశాల తొలగింపుకు చిత్ర యూనిట్ అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ఈ విషయం ప్రకటించకున్నా మురుగదాస్ అండ్ టీం కొన్ని సన్నివేశాల్ని తొలగించేందుకు సిద్ధం అవుతున్నారట.

    సర్కార్ విలన్ మాట.. విజయ్ తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాడు!సర్కార్ విలన్ మాట.. విజయ్ తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాడు!

    కోమలవల్లి పాత్ర చుట్టూ

    కోమలవల్లి పాత్ర చుట్టూ

    వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో ప్రతి నాయకి పాత్రలో నటించింది. ఆమె నటించిన కొన్ని సన్నివేశాలు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రతిష్టని దెబ్బతీసేలా ఉన్నాయంటూ అన్నా డీఎంకే మంత్రులే భగ్గుమంటున్నారు. జయలలిత అసలు పేరు కూడా కోమలవల్లి అనే ప్రచారం జరుగుతోంది.

    థియేటర్స్ ధ్వంసం

    థియేటర్స్ ధ్వంసం

    అన్నా డీఎంకే కార్యకర్తలు సర్కార్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్ పై విధ్వంసానికి దిగుతున్నారు. నిన్న మధురైలో చాలా చోట్ల సర్కార్ చిత్ర ప్రదర్సన ఆగిపోయింది. విజయ్ కటౌట్స్, బ్యానర్లని ధ్వంసం చేశారు. పలు చోట్ల చిత్ర యూనిట్ పై కేసులు నమోదయ్యాయి. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అన్నా డీఎంకే పార్టీ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

     దిగివచ్చిన సర్కార్

    దిగివచ్చిన సర్కార్

    పొలిటికల్ అటాక్ తీవ్రమవుతున్న నేపథ్యంలో సర్కార్ చిత్ర యూనిట్ దిగిరాక తప్పని పరిస్థితి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం వరలక్ష్మి పాత్రలోని కొన్ని సన్నివేశాలని మ్యూట్ చేసి ప్రదర్శించడానికి చిత్ర యూనిట్ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. మరికొన్ని సన్నివేశాలని తొలగించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

    వందకోట్లు దాటేసి

    వందకోట్లు దాటేసి

    సర్కార్ చిత్రం విషయంలో ఇంత వివాదం జరుగుతున్న వసూళ్లపై ఎలాంటి ప్రభావం పడలేదు. రెండు రోజుల్లోనే సర్కార్ చిత్రం 100 కోట్లకుపైగా కలెక్షన్లతో దూసుకుపోతోంది. మెర్సల్ చిత్రం విషయంలో కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయి.

    పోలీసులు క్లారిటీ

    పోలీసులు క్లారిటీ

    ఇదిలా ఉండగా పోలీసులు గత రాత్రి తన నివాసానికి వచ్చినట్లు సర్కార్ చిత్ర దర్శకుడు మురుగదాస్ తెలిపారు. మురుగదాస్ అరెస్ట్ కాబోతున్నారంటూ సన్ పిక్చర్స్ సంస్థ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మురుగదాస్ ని అరెస్ట్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పోలీసులు అన్నారు.

    English summary
    Makers Of Vijay's 'Sarkar' Agree To Remove Controversial Parts. Sarkar' has swept the box office in the first two days of its launch, crossing the Rs. 100-crore mark
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X