విక్రమ్,శంకర్ ల ‘ఐ’ ఫుటేజ్ (వీడియో)
చెన్నై : ‘‘నా సినిమాకు ‘అళగన్' అనిగానీ, ‘ఆనళగన్' అనిగానీ (రెండింటికీ అందగాడు అని అర్థం) టైటిల్ పెడదామనుకున్నాను. కానీ అవి రెండూ ఇంతకు ముందే సినిమా పేర్లుగా వచ్చేశాయి. అప్పుడే ‘ఐ' అనే టైటిల్ తట్టింది'' అని చెప్పుకొచ్చాడు శంకర్ మేకింగ్ వీడియోలో. ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఐ'. విక్రమ్, అమీజాక్సన్ జంటగా నటించారు. సురేష్‌గోపి, సంతానం కీలక పాత్రధారులు. షూటింగ్ పూర్తయింది. చిత్రానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ సందర్బంగా చిత్రం మేకింగ్ వీడియోను విడుదల చేసారు. మీరు చూడండి..ఆ వీడియోలో ఏం చెప్పారో.
పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. డిసెంబర్‌లో ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే తమిళనాట ఆడియో విడుదలైన ఈ చిత్రానికి రెండు భాషల్లోనూ మంచి క్రేజు, దానికి దగ్గ డిమాండ్ ఏర్పడింది.
శంకర్ మాట్లాడుతూ ‘‘నా సినిమాలకు ఒకే అక్షరంతో పేరు పెట్టాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంటుంది. ఒక్క అక్షరంతో టైటిల్ ఉంటే ఎక్కువమందికి బాగా రీచ్ అవుతుంది. విక్రమ్, అమీజాక్సన్ నటించే కథ సౌందర్యానికి సంబంఽధించినది. అందుకే సౌందర్యం, అందగాడు అనే పదాలకు తమిళ డిక్షనరీల్లో అర్థాలను వెతికాను. అప్పుడు ‘ఐ' అంటే సౌందర్యం అనే అర్థాన్ని గమనించాను. ‘ఐ' అనే అక్షరం నాకు అమితంగా నచ్చింది. నా సినిమాకు ఈ టైటిల్ చక్కగా సరిపోతుందనుకుని అదే టైటిల్‌ని పెట్టాను. ‘ఐ' లోగో డిజైన్ కూడా అద్భుతంగా కుదిరినందుకు ఆనందంగా ఉంది'' అని వివరించారు శంకర్.

దర్శకుడు శంకర్ మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం ప్రత్యేకించి పలు హాలీవుడ్ కంపెనీలు పనిచేశాయి. ఆ ప్రతినిధులు షూటింగ్ చూసి ఇలాంటి సినిమాల్లో నటించడం విక్రమ్‌లాంటి నటుడికే సాధ్యమన్నారు. అంత అంకిత భావంతో విక్రమ్ నటించాడు'' అన్నారు.
విక్రమ్ మాట్లాడుతూ ''శంకర్ లాంటి దర్శకుడి చిత్రంలో మళ్లీ నటించడం వరంగా భావిస్తున్నా. ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పుడు మీ ముందు కన్పిస్తున్న 'మృగం' వంటి పాత్ర కోసం కనిష్టంగా మూడు గంటల పాటు మేకప్ వేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఎంతో ఓర్పుతో మేకప్ వేసుకుని కెమెరా ముందుకెళ్లాను. ఇలాంటి సినిమాలో నటించడం ఓ సవాలు లాంటిదే. ఇలాంటి మరో నాలుగు పాత్రల్లో సినిమాలో కన్పిస్తాను. ''అన్నారు.


Click it and Unblock the Notifications











