అమ్మాయి కావాలి.. పెళ్లి చేసుకొంటాను.. విడాకులు పొందినా సరే.. స్టార్ హీరో ప్రకటన

By Rajababu

Recommended Video

అమ్మాయి కావాలి..పెళ్లి చేసుకొంటాను..! స్టార్ హీరో ప్రకటన

తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల ద్వారా ప్రేక్షకుల మదిలో మంచి స్థానం సంపాదించుకొన్న నటుల్లో ఆర్య ఒకరు. తనకు ఓ జీవిత భాగస్వామి కావాలి. త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అంటూ మాట్లాడిన వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో ఆర్య పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో చాలా వైరల్‌గా మారింది. ఎంతకు ఆయన ఏమన్నారంటే..

నా జీవిత భాగస్వామి కోసం

హాయ్ ఫ్రెండ్స్, నా జీవిత ప్రయాణంలో మరో మజిలీకి చేరుకొన్నాను. నా జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నాను. అభిమానులారా నా జీవిత భాగస్వామిని ఎంపిక చేయండి అని ఆర్య అన్నారు. ఈ వీడియోకు మంచి స్పందన వస్తున్నది.

 ఫోన్ నంబర్‌కు కాల్ చేయండి

ఫోన్ నంబర్‌కు కాల్ చేయండి

అందరి మాదిరిగా నేను పెళ్లి వెబ్‌సైట్ల ద్వారా నా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోదలుచుకోలేదు. నాకు ఎలాంటి డిమాండ్లు, కండిషన్లు లేవు. ఎవరైనా నన్ను ఇష్టపడి, నాతో జీవితం బాగుంటుంది అని భావిస్తే 7330173301 అనే నంబర్‌కు ఫోన్ చేయండి.

 డైవోర్స్ తీసుకొన్నా ఫర్వాలేదు

డైవోర్స్ తీసుకొన్నా ఫర్వాలేదు

నాకు జీవిత భాగస్వామిగా ఉండటానికి విడాకులు పొందిన, ఒంటరిగా జీవించే మహిళలైనా ఫర్వాలేదు అని ఆర్య అన్నారు. అంతేకాకుండా కుల, మత, భాష అనే పట్టింపులు నాకు లేవు అని ఓ ప్రకటనలో తెలిపారు.

 ఆచూకీ తెలిస్తే కాల్ చేయండి

ఆచూకీ తెలిస్తే కాల్ చేయండి

తనకు సరిపోయే జీవిత భాగస్వామి గురించి ఆచూకీ తెలిస్తే నా ఫోన్ నంబర్‌కు తెలియజేయండి అని తన ఫొన్ నంబర్‌ను కూడా ఇచ్చారు. అమ్మాయికి కోసం చాలా సీరియస్‌గా వెతుకుతున్నాను. ఇది నా జీవన్మరణ సమస్య అని తెలిపారు.

 వీడియోకు అనూహ్య స్పందన

వీడియోకు అనూహ్య స్పందన

ఆర్య పోస్ట్ చేసిన వీడియోకు అనూహ్య స్పందన వస్తున్నది. ట్రేడ్ అనలిస్టు రమేశ్ బాలా ఆ వీడియోపై కామెంట్స్ చేశారు. అమెరికా రియాలిటీ షో ది బ్యాచ్‌లర్‌కు ఇండియన్ వెర్షన్ అని బాలా అన్నారు.

 సంఘమిత్ర సినిమాలో

సంఘమిత్ర సినిమాలో

ప్రస్తుతం ఆర్య సంఘమిత్ర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ నటి కుష్బూ భర్త సుందర్ సీ దర్శకత్వం వహిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X