twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండో పెళ్లి చేసుకొన్న ప్రముఖ నటి.. వరుడు ఎవరంటే.. ఫేస్‌బుక్ ద్వారా..

    By Rajababu
    |

    మలయాళ నటి దివ్య ఉన్ని మరోసారి వివాహం చేసుకొన్నారు. అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అరుణ్ కుమార్ మణికందన్‌ను రెండో వివాహం చేసుకొన్నారు. అమెరికాలోని హుస్టన్ గురువయప్ప ఆలయంలో అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ వివాహానికి కొంతమంది సన్నిహితులు, స్నేహితులు, కుటుంబసభ్యులు హాజరయ్యారు.

     50కిపైగా చిత్రాల్లో నటన

    50కిపైగా చిత్రాల్లో నటన

    మలయాళ చిత్రసీమలో 50 చిత్రాలకు పైగా దివ్య ఉన్ని నటించారు. 1996లో 14 ఏళ్ల వయసులోనే కల్యాణ సౌగంధికంగా చిత్రా తర్వాత కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత మోహన్‌లాల్, మమ్ముట్టి, దిలీప్ లాంటి అగ్రనటులతో నటించారు. చివరిసారిగా 2013లో ముసాఫిర్ అనే చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత వివాహం చేసుకోవడం సినిమాలకు దూరమయ్యారు.

    Recommended Video

    ప్రభాస్‌ దేవుడు అంటూ పొగడ్తలు.. అనుష్క సంతోషం !
     మొదటి మ్యారేజ్ బ్రేకప్

    మొదటి మ్యారేజ్ బ్రేకప్

    మొదటి వివాహంగా అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సుధీర్ శేఖరన్‌ను వివాహం ఆడారు. వారికి అర్జున్, మీనాక్షి అనే ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు దివ్యతోనే ఉంటున్నారు.

     అరుణ్‌కుమార్‌తో రెండో పెళ్లి

    అరుణ్‌కుమార్‌తో రెండో పెళ్లి

    తాజాగా అరుణ్ కుమార్‌తో జరిగిన పెళ్లి విశేషాలను తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా దివ్య పంచుకొన్నారు. మీరు కురిపించిన ప్రేమ, దీవెనలు, ప్రార్థనలు ఫలించాయి. నా వివాహానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అని దివ్య ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.

     నాట్యశిక్షణకే పరిమితం

    నాట్యశిక్షణకే పరిమితం

    దివ్య వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే ప్రముఖ డ్యాన్సర్‌గా పేరుపొందింది. చిన్నతనంలోనే కేరళ కలాలోసవం నిర్వహించే పోటీల్లో పాల్గొని కళాతిలకం టైటిల్‌ను గెలుచుకొన్నది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చారు. ప్రస్తుతం దివ్య అమెరికాలో నివసిస్తూ నాట్యశిక్షణలో బిజీగా మారారు.

    English summary
    Malayalam actress and fancer Divya Unni got married again to a US-based software professional Arun Kumar Manikandan in a low-key affair. The couple got hitched in Houston at the Guruvayappan temple and was attended by very close relatives and friends.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X