Jailer Vs Jailer జైలర్ టైటిల్ మార్చకపోతే ఆత్మహత్య చేసుకొంటా.. రజనీకాంత్‌కు మలయాళ డైరెక్టర్ వార్నింగ్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో టైటిల్ వివాదం మూవీని చుట్టుముట్టింది. ఆగస్టు 10వ తేదీన జైలర్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అదే టైటిల్‌తో మలయాళంలో మరో సినిమా రిలీజ్ కావడం వివాదంగా మారింది. తమిళ జైలర్ సినిమా నిర్మాతకు టైటిల్ మార్చుకోవాలని రిక్వెస్ట్ చేస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలర్ మూవీ, సినిమా వివరాల్లోకి వెళితే..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాకు నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. 300 కోట్ల రూపాయలతో ఈ సినిమాను సన్ పిక్చర్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వహించారు.స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఈ సినిమాను ఆగస్టు 10న రిలీజ్ చేస్తున్నారు.

Malayalam director Sakkir Madathil requests Rajinikanth over Jailer Movie Title Contraversy

మలయాళంలో దర్శకుడు సాకిర్ మాదితిల్ దర్శకత్వంలో జైలర్ పేరుతో సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. ధ్యాన్ శ్రీనివాసన్ హీరోగా ఎన్‌కే మహ్మద్ నిర్మించారు. అయితే తమ సినిమా టైటిల్‌ను రజనీకాంత్ మూవీ కంటే ముందుగా రిజిస్టర్ చేసుకొన్నాం. కాబట్టి ఈ టైటిల్ హక్కులు మాకే చెందుతాయి అని నిర్మాత మీడియాకు వెల్లడించారు.

జైలర్ టైటిల్ వివాదంపై దర్శకుడు సాకిర్ మదతిల్ స్పందిస్తూ.. జైలర్ సినిమాను 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాం. ఈ సినిమా కోసం నా భార్య, కూతురు నగలు తాకట్టుపెట్టాను. నా కారు కూడా అమ్ముకొన్నాను. బ్యాంక్ నుంచి, ఫైనాన్సర్ల నుంచి లోన్ కూడా తీసుకొని సినిమాను నిర్మించాం. ఇప్పుడు ఆ వడ్డీలు కట్టడం కూడా చాలా కష్టంగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు.

Malayalam director Sakkir Madathil requests Rajinikanth over Jailer Movie Title Contraversy

జైలర్ టైటిల్ విషయంలో మాకు జరుగుతున్న అన్యాయాన్ని రజనీకాంత్ అర్ధం చేసుకొంటామని భావిస్తున్నాం. స్వతహాగా రజనీకాంత్ మంచి మనిషి. ఇతరుల బాధలను ఆయన అర్ధం చేసుకొనే హృదయం ఉంది. నా భవిష్యత్ అంతా జైలర్ సినిమాపైనే ఆధార పడి ఉంది. ఈ వివాదం నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది అని సాకిర్ మదతిల్ మీడియాకు వెల్లడించారు.

జైలర్ టైటిల్ వివాదానికి ఎలాంటి పరిష్కారం దొరకుతుందనే విషయంపై దక్షిణాది సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. మలయాళ డైరెక్టర్ అభ్యర్థనకు రజనీకాంత్ స్పందిస్తారా? లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది. జైలర్ టైటిల్‌తో రెండు సినిమాలు కూడా రిలీజ్ అయితే ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X