twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    45 ఏళ్ల స్నేహబంధానికి తెరపడింది.. శశి మృతిపై కమల్, రాధిక ఎమోషనల్ ట్వీట్

    జాతీయ అవార్డు గ్రహీత మలయాళ దర్శకుడు ఐవీ శశి ఇకలేదు. గత కొద్దికాలంగా అనార్యోగ్యంగా బాధపడుతున్న శశి మంగళవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

    By Rajababu
    |

    జాతీయ అవార్డు గ్రహీత మలయాళ దర్శకుడు ఐవీ శశి ఇకలేదు. గత కొద్దికాలంగా అనార్యోగ్యంగా బాధపడుతున్న శశి మంగళవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. శశి మృతిపై కమల్ హాసన్, రసూల్ పూకుట్టి, రాధిక శరత్ కుమార్ ట్విట్టర్‌లో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

    1975లో ఉత్సవం చిత్రం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించారు. గత మూడు దశబ్దాల కెరీర్‌లో 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. తమిళ, తెలుగు, హిందీ చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు. మోహన్ లాల్, మమ్ముట్టి, రజనీకాంత్, కమల్ హాసన్, రాజేష్ ఖన్నా లాంటి దిగ్గజ నటులతో ఆయన పనిచేశారు.

    అరూదమ్ చిత్రానికి అవార్డు

    అరూదమ్ చిత్రానికి అవార్డు

    1982లో అరూదమ్ చిత్రానికి జాతీయ సమైక్యత అవార్డు లభించింది. ఇంకా తన కెరీర్‌లో పలు కెరీర్‌లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది.

    శశితో 45 ఏళ్ల స్నేహబంధం

    శశికి నాకు మధ్య 45 ఏళ్ల స్నేహబంధం ఉంది. ఆయన ఇకలేరనే విషయంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందాను. ఆయన గొప్ప దర్శకుడు. సోదరి లాంటి శశి భార్య సీమ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు.

    చరిత్ర తిరగరాసిన వ్యక్తి

    మలయాళ చిత్ర సీమ చరిత్రను తిరగరాసిన వ్యక్తి ఐవీ శశి. ఆయన మన మధ్య లేరనే విషయంతో కలత చెందాను. నా కుటుంబ సభ్యుల్లో ఒకరు చనిపోయారనే బాధ కలిగింది. వ్యక్తిగతంగా నేను మంచి వ్యక్తిని కోల్పోయాను ప్రముఖ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి ట్వీట్ చేశారు.

    ఆయనతో పనిచేయడం..

    దర్శకుడు ఐవీ శశి మరణవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయనతో పనిచేసిన రోజులు చాలా గొప్పగా ఉంటాయి. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను అని రాధిక శశికుమార్ ట్విట్టర్‌లో తెలిపారు.

    English summary
    IV Sasi, who made his directorial debut with the 1975 film Utsavam, directed over 150 films in his career spanning over three decades. Not only Malayalam, he has also directed films in Tamil, Telugu and Hindi, with several A-list actors like Mohanlal, Mammootty, Rajinikanth, Kamal Haasan and Rajesh Khanna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X