Jailer Movie: రజనీ దెబ్బకు జైలర్ మూవీ రిలీజ్ వాయిదా.. కొత్త విడుదల తేదీ ఇదే!
ఒకే పేరుతో సినిమాలు తెరకెక్కడం సాధరణమే. ఒకే భాషలో కాకుండా వేర్వేరు భాషల్లోనూ ఒకే భాషతో సినిమాలు రూపొందిస్తారు. కానీ ఒకే పేరుతో నిర్మించిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల చేసేందుకు రెండు చిత్ర బృంధాలు ప్రయత్నించాయి. కానీ చివరికి ఒకవారం తర్వాత విడుదల చేస్తామని మరో చిత్రం యూనిట్ వెనక్కి తగ్గింది. ఆ సినిమానే జైలర్. తలైవా జైలర్‌తో వివాదం కాకూడదనే వాయిదా వేస్తున్నట్టు మలయాళ జైలర్ చిత్రబృందం వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే....
రెండు రోజుల్లో జైలర్ సందడి: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం జైలర్. మిల్క్ బ్యూటీ తమన్నా బాటియా లేడీ లీడ్ రోల్‌లో నటిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ చిత్ర కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 10న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేసింది. సినిమా ప్రమోషన్‌లో యూనిట్ సభ్యులు జీబీ బీజీగా ఉన్నారు. మరో రెండు రోజుల్లో తలైవా నటనను చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టైటిల్ కోసం కోర్టుకు: ఇదిలా ఉంటే అదే రోజున మలయాళంలో జైలర్ పేరుతోనే మరో సినిమా రిలీజ్‌కు సిద్ధం చేశారు. ధ్యాన్ శ్రీనివాసన్, దివ్యా పిళ్లై నాయకా నాయికలుగా దర్శకుడు సక్కర్ మదతిల్ మలయాళంలో జైలర్ పేరుతో మరో చిత్రాన్ని తెరకెక్కించారు. రెండు సినిమాల పేర్లు ఒకే విధంగా ఉండటంతో టైటిల్ వివాదానికి సంబంధించి మలయాళ చిత్ర దర్శకుడు సక్కిర్ మదాతిల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం కూడా క్లియరెన్స్ ఇవ్వడంతో ఆగస్టు 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్కున్నారు.
పేరు మార్పునకు విఫలయత్నం: సూపర్‌స్టార్ రజినీకాంత్ జైలర్ ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. అన్ని భాషల్లోనూ జైలర్ అనే పేరుతోనే విడుదల చేయనున్నారు. దీంతో ఒకే రోజున ఒకే పేరుతో ఉన్న రెండు సినిమాలు విడుదలైతే ఎలా అనే సందేహం మలయాళ జైలర్ చిత్రబృందంలో తలెత్తింది. దీంతో అదే రోజున రిలీజ్ చేయాలనుకున్న మలయాళ జైలర్ చిత్ర నిర్మాతలు, రజినీ జైలర్ పేరును కనీసం మలయాళం వెర్షన్‌లోనైనా మార్చాలని నిర్మాతను ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో ఒకవారం పాటు విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయంతో ఆగస్టు 18 విడుదల చేయనున్నారు.

వాయిదాతో అంతా సెట్: రెండు సినిమా పేర్లు ఒకటే అయినందున ఎలాంటి వివాదాలు జరగకూడదని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్టు మలయాళ జైలర్ చిత్రబృందం వెల్లడించింది. దీంతో కేరళలో జైలర్ మూవీ వివాదం సద్దుమణిగింది. తలైవాను ఎప్పుడెప్పుడు తెరపై చూడాలా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రజినీ జైలర్‌పై భారీ స్థాయిలో అంచనాలున్నాయి.
రజనీ వర్సెస్ చిరు: ఇప్పటికే తమిళ జైలర్ సినిమా కోసం.. అభిమానులు ఎదురుచూస్తున్నారు. తమిళనాడులో ఏకంగా స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు కూడా ప్రకటించారు. ఇక తెలుగులో రజనీ జైలర్ కు పోటీగా చిరంజీవి భోళాశంకర్ సినిమా రాబోతుంది. ఆగస్టు 10న జైలర్ వస్తుండగా.. ఆగస్టు 11న భోళాశంకర్ రిలీజ్ కానుంది. ఇక ఈ రెండు సినిమాల్లో తమన్నా హీరోయిన్ కావడం విశేషం.


Click it and Unblock the Notifications











