'మల్లన్న' పై దిల్ రాజు ఆశలు

By Staff

రెండేళ్లగా ఊరిస్తూ వస్తున్న విక్రమ్ సినిమా 'మల్లన్న' ప్రపంచవ్యాప్తంగా ఈ రోజే (ఆగష్టు 21న) విడుదల కాబోతోంది. సుశీగణేషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్ సరసన క్రేజీ హీరోయిన్ శ్రియ కథానాయికగా నటించింది, సూపర్ స్టార్ కృష్ణ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. రికార్డు స్థాయిలో ఈ చిత్రం హైదరాబాదులో 49 థియేటర్లలో విడుదల కాబోతోంది. రజనీకాంత్ 'శివాజీ' మినహా ఏ అనువాద చిత్రమూ ఈ స్థాయిలో విడుదల కాలేదు. యాదృఛ్చికంగా ఈ రెండు చిత్రాల్లోనూ శ్రియే హీరోయిన్.

ఇక ఈ చిత్ర డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబడుతుందనీ, మంచి విజయాన్ని సాధిస్తుందని కొండంత ఆశతో వున్నారు. ఈ చిత్రం పై వున్న భారీ అంచనాల వల్ల మంచి ఓపెనింగ్స్ వచ్చినా తర్వత కలెక్షన్లు ఏ మేరకు వుంటాయో తెలియాలంటే ఇంకో వారం ఆగాల్సిందే. 'మగధీర' సృష్టిస్తున్న ప్రభంజనంలో ఈ చిత్రం ఏ మేరకు నెట్టుకొస్తుందోనని సినీవిశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విక్రమ్ నటన, స్పెషల్ ఎఫెక్ట్స్, శ్రియ గ్లామర్, దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలెట్స్ గా వస్తున్న ఈ చిత్రం భారతీయ భాషల్లోనే కాక స్పానిష్, ఇటాలియన్ వంటి ఇతర దేశభాషల్లో కూడా అనువాదించబడింది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని మనం కూడా ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X