‘మర్డర్’ పాపకు తమిళ తంబీల బంపర్ ఆఫర్

By Bojja Kumar

మర్డర్ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన తార మల్లికా శరావత్. ఆ సినిమాలో మల్లికా అందాల ప్రదర్శన, ఘాటైన ముద్దు సీన్లు ఆమెకు ఎనలేని క్రేజ్ తేవడమే కాదు, అనతి కాలంలో ఊహించని పాపులారిటీ సంపాదించింది. ఆ సినిమా తర్వాత ఆమె కెరీర్ గ్రాఫ్ భాగానే సాగినా ప్రస్తుతం మాత్రం ఏమంత సంతృప్తి కరంగా లేదు. ఈ నేపథ్యంలో తమిళ తంబీలు ఆమె ముందుకు భారీ ఆఫర్ తో వచ్చి వాలారట.

సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం 'దబాంగ్". ఈ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ఇందులో మలైకా అరోరాపై చిత్రీకరించిన 'మున్నీ బద్నాము హుయి" అనే ప్రత్యేక గీతం కూడా అంతే పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో పవన్‌కళ్యాణ్ 'గబ్బర్‌సింగ్"గా రీమేక్ చేస్తుంటే తమిళంలో 'ఊస్థీ" పేరుతో రీమేక్ అవుతోంది. ఇందులో శింబు కథానాయకుడిగా నటిస్తున్నాడు. రీచా గంగోపాధ్యాయ కథానాయిక.

ఈ చిత్రం కోసం చిత్రీకరించనున్న ప్రత్యేక గీతం కోసం చిత్ర దర్శక నిర్మాతలు బాలీవుడ్ శృంగార తార మల్లికా శరావత్‌ని సంప్రదించి భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారట. దీంతో బాలీవుడ్‌లో పెద్దగా సినిమాలు లేని మల్లికా శరావత్ ఐటమ్‌సాంగ్‌కు అంగీకరించిందని తెలుస్తోంది. అంతే కాకుండా గతంలో కమల్ నటించిన తమిళ చిత్రం 'దశావతారం"తో దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమైన మల్లిక ప్రస్తుతం నటిస్తున్న 'ఊస్తీ" చిత్రంతో తమిళ చిత్రపరిక్షిశమలో పాగా వేయాలని ప్లాన్ చేస్తోందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X