'ఆదిభగవాన్' కోసం మమతా మోహన్ దాస్ త్యాగం
నాగార్జున తో చేసిన కేడీ చిత్రం ఫెయిల్యూర్ నుంచి తేరుకున్న మమతా మోహన్ దాస్ తాజాగా తమిళంలో 'ఆదిభగవాన్' అనే చిత్రం కమిటయ్యింది. అమీర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం కోసం మమతా రెండు సినిమాలు వదలుకుంది. ఈ విషయం గొప్పగా చెప్తూ మమత...అమీర్ సినిమాలో చేసే అవకాశం రావడం గొప్ప విషయం. అందుకే రెండు సినిమాలు వదులుకుని మరీ 'ఆదిభగవాన్'కి డేట్స్ ఇచ్చాను. ఈ చిత్రకథ గురించి అమీర్ బయటికి చెప్పొద్దన్నారు. ఇందులో నేను మోడర్న్ గాళ్ గా నటిస్తున్నాను. 'జయం' రవి హీరోగా చేస్త్తున్నారు' అంటోంది.
అలాగే...ఇటీవలే మలయాళంలో నేను చేసిన హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ విడుదలై యాభై రోజులు పూర్తి చేసుకుంది. వాస్తవానికి 'ఆదిభగవాన్' కోసం అమీర్ అడిగినప్పుడు నా డైరీ ఫుల్లుగా ఉంది. ఉత్తమ దర్శకుడిగా అమీర్‌కి మంచి పేరు ఉంది. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'పరుత్తివీరన్'లో ప్రియమణి నటించి, జాతీయ అవార్డ్ కూడా సొంతం చేసుకుంది. ఆ సినిమాని నేను చూశాను. అలాగే అమీర్ దర్శకత్వంలో రూపొందిన మరో తమిళ చిత్రం 'మౌనమ్ పేసియదే' కూడా చూశాను. కమిటయిన చిత్రంసో కీలక మలుపు తిరగడానికి నా పాత్ర కారణం అవుతుంది. తమిళంలో నాకీ చిత్రం మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకం ఉంది అని చెప్తోంది.


Click it and Unblock the Notifications











