'సూపర్ స్టార్' అంటూ పిలవొద్దంటూ రిక్వెస్ట్
తనను 'సూపర్ స్టార్'అని మీడియా వారు రాయవద్దని,అభిమానులు సైతం పిలవవొద్దని, తాను నిజమైన 'సూపర్‌స్టార్'ను కాననీ, అలా పేర్కొనడం తనకెంత మాత్రం ఇష్టముండదని, ఇలాంటి టైటిల్స్‌పై తనకు నమ్మకం లేదనీ మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తేల్చి చెప్పారు. అలాగే తన ఫ్యాన్స్ కు సైతం ఈ విషయమై విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ...ప్రస్తుత పరిస్థితుల్లో 'సూపర్ స్టార్' అని పిలిపించుకోవడమే పెద్ద తప్పుగా మారిందన్నారు. సూపర్ స్టార్ అనే పదానికి విలువ ఇప్పుడు లేదని,ఇవ్వాళ 'సూపర్ స్టార్స్'ను ఎన్నో ఆరోపణలు పడుతున్నందు వల్లే..తనకు ఇష్టం లేదని అన్నారు.మళయాళ నటుడు టిని టామ్,మమ్ముట్టిని మళయాల చిత్ర పరిశ్రమలో నిజమైన సూపర్‌స్టార్‌గా పేర్కొనడంతో ఇలా రిప్లై ఇచ్చారు. ఇదే విషయమై మాట్లాడుతూ...ప్రస్తుత పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమలోని అన్ని సమస్యలకూ మూలకారణం సూపర్ స్టార్సే అని ప్రేక్షకులు అనుకుంటున్నారన్నారు.
పరిశ్రమను సూపర్ స్టార్స్ శాసిస్తున్న్రారని ముఖ్యమైన నిందారోపణ అన్నారు. అస్సలు శాసించే స్దితిలో తాను లేను కాబట్టి తనకు అలాంటి బిరుదులు వద్దని అన్నారు. అలాగే యంగ్ హీరోలును ప్రోత్సహించరనీ, పైకెదగనీయరన్న కామెంట్స్ కూడా సూపర్ స్టార్స్ కి వస్తున్నాయని అందుకే దానికి దూరంగా ఉందమనుకుంటున్నానని అన్నారు. వీటికి తోడు సూపర్ స్టార్స్ అంతా తమ వయసులో సగం కూడా లేని హీరోయిన్లతో తెరపై తైతిక్కలాడేందుకు ఆత్రుత పడుతున్నారని అవహేళలు చేస్తున్నారని ఆవేదన చెందారు. అది తమ తప్పు కాదని నిర్మాతలు, దర్శకులు ఎలా చెప్తే తాము కేవలం వారి మాటలు విని నటించేవారిమేనని చెప్పారు. అందుకే తనకు మనస్దాపం కలిగిందని తనను 'సూపర్ స్టార్' అనవద్దని 'నటుడు' అని పిలిస్తే చాలని తెలిపారు.


Click it and Unblock the Notifications












