రాత్రంతా అలిసినా ప్రెష్ గానే...

మమ్ముట్టి, స్నేహ కలిసి నటిస్తున్న చిత్రం 'అరువడై'. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల చెన్నైలో జరిగింది. ఇందుకుగానూ ఓ ప్రత్యేక సెట్‌ను వేశారు. అందులో స్నేహ పాల్గొనే సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ఉదయం ఏడు గంటలకు షూటింగ్‌ను ప్రారంభించారు. ఆ రాత్రంతా కూడా పనిచేసి మరుసటి రోజు మధ్యాహ్నం పూర్తి చేశారట. స్నేహను విశ్రాంతి తీసుకోమని యూనిట్ సభ్యులు కోరినా.. 'మళ్లీ మళ్లీ ఈ కాస్ట్యూమ్స్.. ఈ మేకప్ ఎందుకు? నాకేం ఫర్వాలేదు. మీరు కానిచ్చేయండీ' అని చెప్పిందట. దాంతో యూనిట్ వారంతా ఈ కాలంలోనూ ఇలాంటి నటీమణి దొరకడం అదృష్టమని సంబరపడిపోతున్నారు.


Click it and Unblock the Notifications











