పెళ్లి పనులు పూర్తయ్యేదాకా హీరో బ్రేక్
''డిసెంబర్ 22న అబ్బాయి పెళ్ళి. అందుకని కుటుంబమంతా చెన్నై వెళుతున్నాం. ఈ పనుల వల్లే అసలు తీరిక చిక్కడం లేదు. అందుకే పెళ్ళి హడావుడి ముగిసే వరకూ నటనకు కాస్త బ్రేక్ ఇచ్చాను'' అంటున్నారు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి. ఇప్పుడు ఎటు చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నట్లుంది. మమ్ముట్టి కుమారుడు, మలయాళ నటుడు అయిన దుల్‌కార్ సల్మాన్ పెళ్ళి హడావుడిలో ముమ్మట్లి మునిగి తేలుతున్నాడు. అతన్ని పెళ్లాడబోయే వధువు పేరు సుఫియా ..ఆమె ఆర్కిటెక్ట్. అలాగే పెళ్లి విశేషాలు చెప్తూ..పెళ్ళి తర్వాత డిసెంబర్ 26న విందు కార్యక్రమం కూడా ఉన్నదని, ఇక సెట్స్‌లోకి వెళ్ళేది కొత్త సంవత్సరంలోనేనని మలయాళ సూపర్‌స్టార్ స్పష్టం చేశారు. ఇది సినిమా పెళ్ళిలా ఉండదని చెప్పారు.
ఇక మమ్ముట్టి కొడుకు దుల్‌కార్ సల్మాన్ విషయానికి వస్తే ఈ మధ్యనే తన మొదటి చిత్రం 'సెకెండ్ షో' షూటింగ్ పూర్తిచేశాడు. వధువు సుఫియా ఉత్తర భారతదేశానికి చెందిన వ్యాపారవేత్త సయ్యద్ నిజాముద్దీన్ కుమార్తె కాగా, వీరి కుటుంబం చెన్నైలోనే స్థిరపడింది. ఇక ఈ పెళ్లి హడావిడిలో మమ్ముట్టి తాజా చిత్రం 'వెనిస్ లె వ్యాపారి' సినిమా విడుదల పనులు ఆలస్యమయ్యాయి. తన కొడుకు పెళ్ళి రోజునే ఈ సినిమా విడుదలవుతుందని భావించినప్పటికీ, ఆ అవకాశాలు తక్కువేనంటున్నారు.


Click it and Unblock the Notifications












