మమతా మోహన్ దాస్ కి ఎక్సలెంట్ ఆఫర్
యమదొంగ, కింగ్, కేడీ వంటి చిత్రాలతో తెలుగు నాట పరిచయమైన మమతా మోహన్ దాస్ ఇక్కడ నిలదొక్కలేకపోయింది. అయితే ఆమె ప్రస్తుతం ఓ పెద్ద ఆఫర్ సంపాదించింది. 'పరుత్తివీరన్' ద్వారా ప్రియమణి జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా అవార్డును అందుకునేలా చేసిన సెన్సేషనల్ దర్శకుడు అమీర్ దర్శకత్వంలో చేయనుంది. ఆది భగవాన్ టైటిల్ తో తయారయ్యే ఈ సినిమా కూడా వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోంది. ఇందులో ఆమె పాత్ర కూడా భిన్నంగా ఉంటుందని తెలిసింది. అలాగే ఈ చిత్రంలో జయం రవి హీరోగా చేస్తున్నారు. మొదట నీతూ చంద్రని ఈ పాత్రకు అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ చేయటం కష్టమని మమతాని తీసుకున్నారని తెలుస్తోంది. మమతా మోహన్ దాస్..ఓ ఎన్నారై పాత్ర చేయనుంది. ఈ సినిమా మమతామోహన్‌దాస్‌కి మంచి పేరు తెచ్చిపెట్టడం ఖాయం అని చెప్పుతున్నారు. ఈ సినిమాపై మమతా మోహన్ దాస్ కూడా ఎంతో ఆశతో ఉన్నారు. ఇది గాక మలయాళంలో మరో రెండు చిత్రాల్లో మమతా మోహన్ దాస్ ప్రస్తుతం నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











