»   » చీటింగ్ చేసాడంటూ రజనీకాంత్‌పై వ్యక్తి ఆరోపణలు

చీటింగ్ చేసాడంటూ రజనీకాంత్‌పై వ్యక్తి ఆరోపణలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి కొత్తగా చెప్పాల్పిన పని లేదు. ఆయనంటే దేవుడుగా భావిస్తారు అభిమానులు. ఇప్పటి వరకు ఆయన ఎన్నోమంచి పనులు చేసారు కూడా. అలాంటి వ్యక్తిపై తాజాగా ఓ వ్యక్తి సంచలన ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించాడు.

ఓ ప్రముఖ ఆంగ్లపత్రిక కథనం ప్రకారం....38 ఏళ్ల వయసుగల పి.కె. కరుణ అనే వ్యక్తి రజనీకాంత్ తనను మోసం చేసాడని ఆరోపిస్తూ శుక్రవారం చెన్నై పోలీసులను ఆశ్రయించాడు. కూతురు ఐశ్వర్యను తనకిచ్చి పెళ్లి చేస్తానని రజనీకాంత్ ప్రామిస్ చేసాడని, మాట నిలబెట్టుకోకుండా మోసం చేసాడని ఆ వ్యక్తి పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఆ వ్యక్తి ఆరోపణలతో ఖంగుతిన్న పోలీసులు అతన్ని విచారించి వార్నింగ్ ఇచ్చి వదిలి పెట్టినట్లు తెలుస్తోంది. అతను తమిళ సినీ పరిశ్రమలో సెట్ డిజైనర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తుంది. విచారణలో అతను చెప్పిన వివరాలను పరిశీలించిన అనంతరం పోలీసులు అతని ఫిర్యాదు స్వీకరించకుండా వార్నింగ్ ఇచ్చి వదిలి పెట్టినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత కరుణ ఓ ఆంగ్లపత్రికను సంప్రదించి వివషయాన్ని వివరించాడు. ఐశ్వర్య రజనీకాంత్ యానిమేషన్ మూవీ ప్లాన్ చేసారని, తాను సెట్ వేసేందుకు ఒప్పుకున్నానని, ఈ క్రమంలో రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్యను తనికిచ్చి పెళ్లి చేస్తానని మాటివ్వడంతో, సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశం కల్పిస్తానని మాటిచ్చాడని, కానీ తన మాటను నిలబెట్టుకోలేదని వెల్లడించాడు. అయితే సదరు వ్యక్తి చెప్పిన మాటలు...నమ్మశక్యంగా లేక పోవడంతో పోలీసులు వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టినట్లు స్పష్టం అవుతోంది.

English summary
According TOI, There was a flutter at the police commissioner's office here on Friday when a 38-year-old man came to lodge a complaint against actor Rajinikanth. Karuna, said, "I am from a village near Karuna. When Aishwarya Rajnikanth was planning an animation movie, I promised to fix the sets.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu