»   » హీరోయిన్‌ హన్సికపై చీటింగ్ కేసు.. దిమ్మతిరిగేలా షాకిచ్చిన..

హీరోయిన్‌ హన్సికపై చీటింగ్ కేసు.. దిమ్మతిరిగేలా షాకిచ్చిన..

Posted By:
Subscribe to Filmibeat Telugu

దక్షిణాది అందాల తార హన్సికకు ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా మేనేజర్ మునుస్వామి ఆమెపై చీటింగ్ కేసు పెట్టడం తమిళ చిత్రపరిశ్రమలో చర్చనీయాంశమైంది. తనకు రావాల్సిన డబ్బును సెటిల్ చేయడం లేదని తమిళ నిర్మాతల మండలి (నడిగర్ సంఘం)లో ఆయన ఫిర్యాదు చేశాడు. అయితే మునుస్వామి ఆరోపణలపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. హీరోయిన్ హన్సిక డేట్స్, రెమ్యునరేషన్ విషయాలు ఆమె తల్లి స్వయంగా చూసుకొంటుంది. అయితే మేనేజర్‌గా వ్యవహరించినందుకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం లేదని ఆరోపణలు చేయడంపై సినీవర్గాలు సందేహాలను వెలిబుచ్చుతున్నారు.

కుర్ర హీరోతో హన్సిక అఫైర్..!
ఆధారాలతోనే చీటింగ్ కేసు

ఆధారాలతోనే చీటింగ్ కేసు

తనకు ఇవ్వాల్సిన మొత్తాలకు రుజువులు, సాక్ష్యాలు ఉన్నాయి. అవసరమైతే వాటిని బయటపెడుతాను. వాటి ఆధారంగానే కేసు నమోదు చేశాను అని మునుస్వామి మీడియాకు వెల్లడించారు.

 ముదురుతున్న వివాదం

ముదురుతున్న వివాదం

మునుస్వామి ఫిర్యాదుపై హన్సిక నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తున్నది. అయితే మునుస్వామికి, ఆమెకు మధ్య చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయనే మరో వాదన వినిపిస్తున్నది.

ఆరోపణల్లో వాస్తవం లేదంటూ

ఆరోపణల్లో వాస్తవం లేదంటూ

దక్షిణాదిలో అగ్ర హీరోయిన్‌గా రాణిస్తున్న హన్సిక ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మునుస్వామి ఆరోపణల్లో వాస్తవం లేదు అని పలువురు అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.

హన్సిక తాజా చిత్రాలు

హన్సిక తాజా చిత్రాలు

వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న అందాల భామ హన్సిక ప్రస్తుతం విక్రమ్ ప్రభు సరసన తుపాకి మున్నై అనే చిత్రంలో నటిస్తున్నది. అలాగే శామ్ ఆంటన్ రూపొందిస్తున్న చిత్రంలో హీరో అధర్వ సరసన హీరోయిన్‌గా కనిపించనున్నారు.

English summary
Hansika Motwani manager Munusamy has registered a cheating complaint against leading actress in Nadigar Sangam. Munusamy says he worked as a manager to the Hanisika for a long time but she hasn’t settled his remuneration yet. Munusamy raised his concern in his petition to Nadigar Sangam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu