మంచు ఫ్లాఫ్ సినిమా తమిళంలోకి డబ్బింగ్

By Srikanya

చెన్నై : విష్ణు, తాప్సీ జంటగా తెలుగులో విడుదలైన 'వస్తాడు నారాజు' తమిళంలో 'పొలిటికల్‌ రౌడీ'గా రానుంది. శివం అసోసియేట్స్‌ నిర్మాణ సంస్థ దీన్ని అనువదించనుంది. ఇందులో ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, షియాజి షిండే తదితరులు నటించారు. శిబి చందర్‌ తమిళంలో మాటలు రాశారు. హేమంత్‌ మధుకర్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించారు. రౌడీల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం తెలుగులో ఫ్లాఫ్ అయ్యింది. ఈ చిత్రం తమిళంలోకి డబ్బింగ్ చేయటంతో ఫిల్మ్ నగర్ వాసులు ఆశ్చర్యపోతున్నారు.

నిర్మాత ఎస్‌.సుందరలక్ష్మి మాట్లాడుతూ.. ''ప్రస్తుతం డబ్బింగ్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్య పాత్రలకు సంబంధించి పూర్తయింది. మణిశర్మ సంగీత సారథ్యం వహించారు. కనిక్కొడి, పుణ్య, తమిళముదన్‌ పాటలు రాశారు. ఇలంగో ఎడిటింగ్‌తో సినిమా వేగంగా సాగుతుంది. ఈ నెల 10వ తేదీన చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము''అని పేర్కొన్నారు.

Manchu Vishnu's Vasthadu Naa Raju dubbing

విక్రమ్‌ప్రభు హీరోగా తమిళంలో ఘనవిజయాన్ని సాధించిన చిత్రం అరిమ నంబి. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్ర తెలుగు రీమేక్ హక్కుల్ని మంచు విష్ణు సొంతం చేసుకున్నారు. ఈ రీమేక్‌లో ఆయనే హీరో గా నటించనున్నట్లు, దీనికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం.

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు తెలిసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్న తొలి తమిళ రీమేక్ చిత్రమిదే కావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X