హీరో కొడుకుతో మణిరత్నం నెక్ట్స్ చిత్రం
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన తదుపరి చిత్రానికి సీనియర్ తమిళ హీరో కార్తీక్ కుమారుడు గౌతమ్ ని వెండి తెరకు పరిచయం చేయనున్నారని సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న రావణ్ అనంతరం ఈ చిత్రాన్ని మణిరత్నం ప్రారంభిస్తారని చెప్తున్నారు. అలాగే ఈ కొత్త చిత్రాన్ని కూడా తమిళ,హిందీ బాషల్లో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. హిందీ వెర్షన్ కు గానూ రణబీర్ కపూర్ ని అడుగుతున్నారు. ఇక కార్తీక్ గతంలో మణిరత్నం చిత్రం అగ్ని నక్షిత్రం(ఘర్షణ)లో నటించారు. అలాగే రావణ్ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ ప్రధానపాత్రలుగా చేస్తున్నారు. ప్రియమణి కూడా నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించనుంది. గురు చిత్రం తర్వాత మణిరత్నం చేస్తున్న చిత్రం ఇదే.
మణిరత్నం రావణ్ కార్తీక్ ఘర్షణ విక్రమ్ ఐశ్వర్యా రాయ్ అభిషేక్ బచ్చన్ రోజా గురు mani ratnam suhasini raavan aishwarya rai abhishek bachchan guru vikram


Click it and Unblock the Notifications