మణిరత్నం కొత్త సినిమా టైటిల్ ఏంటంటే...

విక్రమ్,గోవిందా ముఖ్యమైన పాత్రలు పోషించనున్నారు. అయితే తమిళ వెర్షన్ కి వచ్చేసరికి విక్రమ్,ఐశ్వర్యా జంటగా కనిపిస్తారు. గోవిందా హిందీలో చేసే పాత్రను కార్తీక్ తమిళ్ లో చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇక మళయాళ నటుడు పృధ్వీరాజ్ హిందీలో విక్రమ్ చేసిన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను తమిళ్ లో చేయనున్నాడు. పృధ్వీ రాజ్ భార్యగా వసుంధర కనిపించనుంది.
అలాగే ప్రియమణి మరో ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఏ.ఆర్. రహమాన్ ఇప్పుడు ఈ చిత్రానికి ట్యూన్స్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ వివరాలు అధికారికంగా వెళ్ళడయ్యే అవకాశం ఉంది. గతంలో మహాభారంతం ఆధారంగా దళపతి అనే చిత్రాన్ని మణిరత్నం రూపొందించి పెద్ద హిట్ సాధించటం తెలిసిన విషయమే.


Click it and Unblock the Notifications











