మణిరత్నం మెగా ప్లాన్స్: విక్రమ్, విజయ్, శింబులతో భారీ మల్టీస్టారర్?
ప్రముఖ దర్శకుడు మణిరత్నం చాలా కాలంగా కల్కి హిస్టారికల్ నవల 'పొన్నియిన్ సెల్వన్' ఆధారంగా సినిమా చేయాలనుకుంటున్నారు. గతంలో ఆయన ఓసారి ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మణిరత్నం మళ్లీ దీనిపై ఫోకస్ పెట్టారట.
ఇటీవలే భారీ తారాగణంతో 'నవాబ్' చిత్రాన్ని తెరకెక్కించిన ఈ స్టార్ డైరెక్టర్ మరోసారి... స్టార్ హీరోల కలయికలో భారీ మల్టీస్టారర్ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. తమిళ స్టార్స్ విజయ్, శింబు, చియాన్ విక్రమ్‌లతో ఈ మెగా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

'పొన్నియిన్ సెల్వన్' ఆధారంగా ఒక మంచి కథను మణిరత్నం సిద్ధం చేసుకున్నారని... ఈ కథను ఈ ముగ్గురు స్టార్లకు చెప్పడానికి సిద్ధమవుతున్నారని, వారు ఒప్పుకుంటారనే నమ్మకంతో ఉన్నారని తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రయత్నాలు జరిగాయి. విజయ్, మహేష్ బాబు కాంబినేషన్లో చేయాలనుకున్నారు. కానీ బడ్జెట్ ఇష్యూల కారణంగా ఆగిపోయినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. మణిరత్నం మరోసారి ప్రయత్నాలు మొదలు పెట్టడం హాట్ టాపిక్ అయింది. ఏది ఏమైనా దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











