స్వర్ణయుగం ప్రారంభం.. పొన్నియన్ సెల్వన్ పోస్టర్ వైరల్

దర్శకుడిగా మణిరత్నం స్టైలే వేరు. ఆయన సినిమాలు వస్తున్నాయంటే ప్రేమ పక్షులకు ఓ పండుగే. సినిమాను తెరకెక్కించే విధానం, కథను ఆసక్తికరంగా మలిచే తీరు ఇలా అన్నింటిలో మణిరత్నం శైలి భిన్నంగా ఉంటుంది. అయితే గతంలో మాదిరి ఆ రేంజ్ సక్సెస్‌ను చూడలేకపోతున్నాడు. చివరగా వచ్చిన నవాబ్ కొద్దిమేర ఫర్వాలేదనిపించనా.. మణిరత్నం రేంజ్ కాదని టాక్ వినిపించింది.

'నవాబ్‌' లాంటి భారీ మల్టీ స్టారర్‌ను అరవిందస్వామి, శింబు, విజయ్‌సేతుపతి, అరుణ్‌ విజయ్‌లతో మణిరత్నం మ్యాజిక్ చేసే ప్రయత్నం చేయగా.. కొద్దిమేర విజయం సాధించాడు. ఇప్పుడు దీని తర్వాత ఆయన నుంచి రాబోతున్న మరో క్రేజీ మల్టీస్టారర్‌ 'పొన్నియన్‌ సెల్వన్‌'. చియాన్‌ విక్రమ్‌ ఈ చిత్రంలో ఓ కథానాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో భయంకరమైన, దూకుడు స్వభావం కలిగిన పాత్రలో కనిపించనున్నట్లు... ఒకరకంగా చెప్పాలంటే మృగంలాంటి పాత్ర అంటూ ఓ హింట్ కూడా ఇచ్చాడు.

Mani Ratnam Ponniyan Selvan Poster Goes Viral

ఈ చిత్రంలో విక్రమ్‌తో పాటు విజయ్‌ సేతుపతి, ఐశ్వర్యరాయ్, మోహన్‌బాబు, కార్తి, కీర్తి సురేష్, జయం రవితదితరులు ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం షూటింగ్‌ను కూడా మొదలు పెట్టేసింది. కల్కీ రాసిన చారిత్రక నవల 'పొన్నియిన్‌ సెల్వన్‌' ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేయగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రానికి ఎడిటర్‌గా శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్‌గా రవి వర్మన్, మాటల రచయితగా జయ మోహన్, సంగీత దర్శకుడిగా ఏ ఆర్ రెహ్మాన్ వ్యవహరించబోతోన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X