మణిరత్నం 'రావణ్' రిలీజ్ డేట్ ఎప్పుడంటే...
మణిరత్నం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'రావణ్' చిత్రం జూన్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకొన్నారు. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల అయ్యే ఈ చిత్రంలో విక్రమ్, అభిషేక్‌బచ్చన్, ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాల్ని ఆధారంగా చేసుకొని అల్లిన కథ ఇది అంటూ మణిరత్నం చేప్తున్నారు. అయితే కథ మొత్తం రావణాసురుడి పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుందని తెలుస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రస్తుతం చెన్నైలో తెలుగు వెర్షన్‌కి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. విక్రమ్ తెలుగులో డబ్బింగ్ చెప్పుకొంటున్నారు. పల్లెటూరి యాసలో ఆయన సంభాషణలుంటాయి. ఇక ఈ చిత్రం రిలీజుకు ముందుగా మేలో జరిగే కేన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శిస్తారని తెలిసింది. అందుకోసమే నిర్మాణానంతర కార్యక్రమాల్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అలాగే అమెరికా, కెనడా, లండన్, ఫ్రాన్స్‌ల్లో 'రావణ్' చిత్ర ప్రచారానికి అభిషేక్, ఐశ్వర్య, విక్రమ్, మణిరత్నం వెళ్లబోతున్నారు. గురు తర్వాత మణిరత్నం చేస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో తెలుగుతార ప్రియమణి ఓ కీలకమైన పాత్రను చేసింది.ఇక మణిరత్నం ఇంతకు ముందు భారతం ఆధారంగా దళపతి చిత్రం రూపొందించి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











