సమంతని ఆ స్టార్ డైరక్టర్ రిజెక్ట్ చేసారు
ఏమి మాయ చేసావే,దూకుడు,బృందావనం చిత్రాలతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా ఎదురైన సమంతకు ఓ చేదు అనుభవం ఎదురైంది. స్టార్ డైరక్టర్ మణిరత్నం ఆమెను తన సినిమాల్లోకి తీసుకోవాటనికి నిరాకరించారు.ఆమె గత కొద్ది రోజులుగా కంటిన్యుగా కెమెరామెన్ రాజీవ్ మీనన్ చెన్నై ఆపీస్ లో స్క్రీన్ టెస్ట్ లకు హాజరైంది. కానీ ఆమె తన రొమాంటిక్ లవ్ స్టోరీకి సరిపోదని మణిసార్ రిజక్ట్ చేసారు. ఆ సినిమాలో సెలెక్టు అయితే తన కెరీర్ లో మరో మెట్టు ఎక్కినట్లే అని సమంత ఎంతో ఊహించుకుంది.కానీ ఆశలన్నీ కల్లలయ్యాయి. తమిళ హీరో కార్తీక్ కుమారుడు గౌతమ్ హీరోగా రూపొందించే ఆ చిత్రంలో ఆమెను తీసుకోలేదు.ఇక కార్తీక ని కూడా ఇంతకుముందు మణిరత్నం కాదన్నారు.మరో అమ్మాయి కోసం ఆయన వెతుకున్నారు.అయితే ఆయన తన ప్రేమ కథకు ప్రెష్ హీరోయిన్..ఏ ఇమేజ్ లేని అమ్మాయి అయితే బెటర్ అనుకుని కాదన్నారని చెన్నై వర్గాలు అంటున్నారు.
ప్రస్తుతం సమంత తన తదుపరి ప్రాజెక్టుల గురించి చెబుతూ...రాజమౌళి ఈగ,గౌతమ్ మీనన్ తో చేస్తున్న సినిమాలు రెండూ తమిళ,తెలుగులో ఒకేసారి విడుదల అవుతాయి. రెండింటిలోనూ నానినే హీరో. అలాగే సిద్దార్ధ,నాగచైతన్య,మహేష్ బాబు సరసన ప్రాజెక్టులు కన్ఫర్మ్ అయ్యాయని వినపడుతోంది అంటే...ఫస్ట్ డే షూట్ అయితే కానీ నేను ఏ సినిమానూ నా చేతిలో ఉందని చెప్పలేను అంది. నాకు అటువంటి కొన్ని నమ్మకాలు ఉన్నాయని తెలివిగా సమాధానం చెప్పింది. ఇక ప్రస్తుతం సమంత డైరీ ఫుల్ గా ఉంది. ఆమె గౌతమ్ మీనన్ మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈగ లోనూ చేస్తోంది. అంతేగాక నాగచైతన్య సరసన ఆటోనగర్ సూర్యలోనూ, మహేష్ సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలోనూ ఆమెనే తీసుకున్నారు.


Click it and Unblock the Notifications











